ఎల్లుండి నుంచి ఈ రాశులవారు ఉన్నది కూడా పోగొట్టుకుంటారు
అక్టోబరు రెండోతేదీన ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కన్యారాశిలో ఏర్పడుతుండటంతో ఈ రాశివారు 15 రోజులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా సూర్యగ్రహణం వల్ల నాలుగు రాశులు అధిక ప్రభావానికి లోనవుతాయి. అదేరోజు మహాలయ అమవాస్య ఉంది. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులవారు సమాజంలో గౌరవాన్ని కోల్పోవడంతోపాటు ప్రమాదంలో గాయాలపాలవుతారు. రెండువారాలపాటు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ సూర్యగ్రహణ ప్రభావం మనదేశంలో ఉండనప్పటికీ కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాలి.
తుల రాశి
ఈ రాశివారు ఆస్తులు పోగొట్టుకుంటారు. రెండువారాలపాటు డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు ఎక్కడైనా పెట్టుబడి పెట్టే విషయంలో కూడా అప్రమత్తత అవసరం. ఈ రెండువారాలు దూరంగా ఉంటే మంచిది. గ్రహణం సమయంలో మోసపోయే అవకాశం కనపడుతోంది.

కన్యారాశి
అనారోగ్యం కలుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకుంటారు. ఉన్న పేరు పోతుంది. ప్రమాదంలో గాయాలవుతాయి. ప్రతి విషయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి.
మిథున రాశి
కుటుంబంలో పెద్దలకు అనారోగ్యం కలుగుతుంది. వాహన గండం కనపడుతోంది. మనశ్శాంతిని కోల్పోతారు. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రతి చిన్న విషయానికి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
కుంభరాశి
అప్పుల బాధలు ఎక్కువవుతాయి. కొత్త పనులు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రెండువారాలు జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి
వీరికి బాగా కలిసివస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవడంతోపాటు అత్యంత అనుకూలంగా ఉండే సమయం ఇది. సూర్యగ్రహణం వీరికి బాగా కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications