౩౦౦ ఏళ్ల తర్వాత దీపదుర్గాయోగం.. ఈ మూడు రాశులపై కుబేరుడి కనక వర్షం
దీప దుర్గాయోగం ఎంతో ప్రభావ వంతమైనది. ఈ విషయాన్ని పండితులు చెబుతుంటారు. ప్రధానంగా ఈ యోగం 300 సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది. దీనివల్ల మూడు రాశులవారికి గొప్ప రాజయోగం పడుతుంది. దీప దుర్గాయోగం అనేది రాహువు, కేతువుకు సంబంధించినది. దీనివల్ల కొందరి జీవితాల్లో శుభపరిణామాలు గోచరిస్తాయి. అందుకే దీపదుర్గా యోగం మంచిదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తుంటారు.
శాస్త్రంలో కొన్ని యోగాలు మనిషి జీవన విధానంపై ఎంతో ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్య పండితులు భావిస్తారు. దీంతో కొందరు రాత్రికి రాత్రే జీవితంలో సక్సెస్ సాధిస్తారు. ఈ యోగం గురించి చాలామందికి తెలియదు. తాంత్రిక శాస్త్రంలో దీన్నిగురించి చెబుతుంటారు. జ్యోతిష్యుల వాదనలు భిన్నంగా వినిపిస్తుంటారు. తాంత్రిక విద్యలు ఉపాసన చేసేవారికే ఇది తెలుస్తుందని చెబుతుంటారు. కొన్నిరకాల తాంత్రిక విద్యలను అత్యంత రహాస్యంగా చేస్తారు. వీటి ప్రభావం మనిషిపై ఉంటుంది. ప్రధానంగా తుల, కర్కాటకం, మిథున రాశులవారికి దీప దుర్గా యోగం శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మిథునం
వీరి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి సమయం. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ ఉండటంతోపాటు వేతన పెరుగుదల ఉంది. విద్యార్థులు విదేశీ యానానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకునే ఈ సమయం ఎంతో అనువుగా ఉంటుంది.
కర్కాటకం
స్నేహితులతో అప్రమత్తంగా ఉండాలి. జీవితంలో ఒక్కసారిగా ధనవంతులవుతారు. కోర్టు తగాదాల్లో ఉన్న భూమిని వీరు సొంతం చేసుకుంటారు. అనుకోకుండా పెళ్లి కుదురుతుంది. పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి.
తుల
వీరు రాత్రికి రాత్రే స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు. వీరిలో ఉండే తెలివితేటలవల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అనుకోని విధంగా డబ్బులు చేతికి వస్తాయి. సంపదలో వీరికి కలిగే ఐశ్వర్యం చూసి అందరూ ఆశ్చర్యపోతారు.












Click it and Unblock the Notifications