కేతువు-గురువు గోచారం.. ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే
జ్యోతిష్యం ప్రకారం కేతువును పాప గ్రహంగా భావిస్తారు. అటువంటి కేతువు దేవ గురువైన బృహస్పతితో కలవడంవల్ల కొన్ని రాశుల జీవితాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయి. ఒకరకంగా వీరి దశ అనేది ఊహించని విధంగా మారిపోతుంది.
కొన్ని యోగాలు, గోచారాలవల్ల వ్యక్తి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు చోటుచేసుకుంటాయి. అప్పటివరకు ఉన్న స్థానం నుంచి గొప్ప స్థానానికి ఎదుగుతారు. కాలం కూడా కలిసివస్తుంది. ఇటువంటి సమయంలో ఏ పనులు తలపెట్టినా విజయాలను సాధిస్తారు. కేతువు-గురువు గోచారం మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.

గురువు అనుకూలంగా ఉంటే ఎటువంటి పనులైనా సులువుగా జరుగుతాయి. వివాహం చేయాల్సి వచ్చినా, ఇల్లు కొనుగోలు చేయాలన్నా, ఉద్యోగంలో మార్పు పొందాలన్నా గురు గ్రహం మంచి లాభాలను కలిగిస్తుంది. దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కేతువు, గురువు కలవడంవల్ల కొన్ని రాశులవారి జాతకంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి.
వృషభరాశి
ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పనిలో నైపుణ్యాన్ని సాధిస్తారు. అనుభవించిన కష్టాలన్నీ దూరమవుతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. అన్నింట్లో విశేషంగా రాణిస్తారు.
కర్కాటక రాశి
కలలో కూడా ఊహించని విధంగా ధనలాభం సంభవిస్తుంది. ఇన్నాళ్లుగా వేచిన కల సాకారమవుతుంది. అంతేకాదు అఖండ ధనయోగం సొంతమవుతుంది. తండ్రుల ఆస్తి దక్కుతుంది.
కన్య రాశి
రియల్ ఎస్టేట్ లో ఉన్నవారికి ఇది మంచి సమయం. ఈ యోగంవల్ల విదేశాలకు వెళ్లేవారికి కూడా కలిసివస్తుంది. లాటరీలు, ఇంట్లో దాచివుంచిన డబ్బులు వీరి సొంతమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది.
కేతు, గురువులు మరింత అనుకూలంగా ఫలితాలు ఇవ్వాంటే ప్రతిరోజు రావి చెట్టు నీడలో దీపం పెడుతుండాలి. నల్లటి చీమలకు పంచదారను పెట్టాలి. పేదలకు , అన్నార్థులకు అన్నదానం చేయడంవల్ల జాతకంలో ఎలాంటి దోషాలున్నా పోతాయి.












Click it and Unblock the Notifications