18 ఏళ్ల తర్వాత శుక్రాదిత్య యోగం.. ఈ రాశులవారు జమిందారులే
సంపదకు కారకుడైన శుక్రుడు ఈనెల 24న మేష రాశి ప్రవేశం చేస్తాడు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. గ్రహాలకు రాజైన సూర్యుడు ఈనెల 13నే మేషరాశిలోకి సంచారం చేశాడు. 18 సంవత్సరాల తర్వాత వీటి కలయిక జరుగుతుండటంతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల నాలుగు రాశులవారి జాతకం అదృష్టంతో నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతోపాటు మరికొన్ని శుభ ఫలితాలు కూడా జరుగుతాయి.
మేష రాశి
వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో జీవించడంతోపాటు కొత్త కొత్త సవాళ్లను స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ప్రేమ భాగస్వామితో కలిసి డేటింగ్ కు వెళతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి.

కన్యా రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ లో విజయం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరగడంతోపాటు ప్రేమ సంబంధాలు బలోపేతమవుతాయి. ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కుల సాధిస్తారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనులను ఈ సమయంలో విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.
తులా రాశి
ఈ రాశివారికి శుక్రాదిత్య యోగం బాగా కలిసివస్తుంది. జీవితంలో అన్నీ సానుకూల మార్పులే చోటుచేసుకుంటాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. డబ్బు సంపాదనకు కొత్త అవకాశాలు దొరుకుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో నిలిచిపోయిన పనులను పూర్తిచేస్తారు. బకాయి డబ్బులను తిరిగి చెల్లిస్తారు. జీవితంలో భౌతిక సౌకర్యాలు కలుగుతాయి.
మిథున రాశి
పనిచేసే ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదురుతుంది. ఇది మీకు లాభదాయకంగా మారుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభించడంతోపాటు సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. పెట్టుబడులు పెట్టే ఒప్పందాలవల్ల జీవితం సంతోషకరంగా మారుతుంది.












Click it and Unblock the Notifications