19 నుంచి ఏలినాటి శని.. ఇలా చేయండి పోతుంది
శనిదేవుడు నెమ్మదిగా కదులుతుంటాడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించేందుకు దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. ఏలినాటి శనితో బాధపడుతున్నవారిపై శనిదేవుడి సంచార ప్రభావం ఉంటుంది. జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవితం సవాళ్లతో కూడుకొని ఉంటుంది. అటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
మకర రాశి, కుంభరాశులకు శని అధిపతిగా ఉన్నాడు. ఈనెల 19వ తేదీ నుంచి శని కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఏలినాటి శనితో బాధపడేవారు మరిన్ని సమస్యల బరిన పడతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఐదు రాశులవారికి తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వారు ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

రుణం తీసుకోవడం మానేయాలి
ఏలినాటి శని మీన రాశి వారికి మధ్యంతర దశలో, కుంభ రాశి వారికి రెండో దశ, మకర రాశి వారికి మూడో దశ కొనసాగుతోంది. వీరు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రుణం తీసుకునే అలావాటుంటే దాన్ని మానేయాలి. లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు. పెట్టుబడులు కూడా మానుకోవాలి. కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండా ఉండటంతోపాటు దూర ప్రయాణాలను కూడా నిలిపివేయాలి. కర్కాటక రాశి, వృశ్చిక రాశులవారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. గతంలో ఉన్న వ్యాధులు రెట్టింపు అవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆహారాలు తీసుకునే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి పనులు చేసినా ఆశించిన ఫలితాలు రావు. కష్టపడి పనిచేయడంవల్ల మాత్రం కొంత లాభాలు వస్తాయి.
శని నివారణ
తప్పకుండా శనిదేవుడి మందిరాన్ని సందర్శించాలి. ఆవనూనెతో దీపాన్ని వెలిగించి శని చాలీసా పఠించాలి. దీనివల్ల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉసిరిచెట్టు కింద ఆవనూనె దీపాన్ని వెలిగించడం వల్ల కూడా ఏలినాటి శని నుంచి కొంత విముక్తి లభిస్తుంది.












Click it and Unblock the Notifications