ఉగాది నుంచి ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం.. తిరుగే లేదు

క్రోధి నామ సంవత్సరంలో మహావిష్ణువు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉగాది రోజు సర్వార్ధ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, ప్రీతి యోగం ఏర్పడతాయి. కొత్త సంవత్సరంలో అంగారకుడు రాజుగా ఉంటే శని మంత్రిగా ఉంటాడు. ఈ శుభయోగాలవల్ల కొన్ని రాశులవారికి ఆదాయం బాగా పెరుగుతుంది. అన్ని రంగాల్లో విజయం సాధించడంతోపాటు ఏడాది పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఏయే రాశులవారికి ఎటువంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి
ఉగాది తర్వాత చంద్రుడు మేష రాశిలోకి సంచారం చేస్తాడు. గురువతో స్నేహం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతోపాటు వేతనాలు పెరుగుతాయి. కెరీర్ బాగుంటుంది. మంచి వృద్ధి సాధిస్తారు. తెలివితేటలవల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

these zodiac signs will get goddess lakshmi grace due to telugu new year ugadi

కర్కాటక రాశి
చంద్రుడి ప్రభావంతో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శనిదేవుడి అనుగ్రహంతో అన్నిరంగాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లతో శుభవార్తను వింటారు.

సింహ రాశి
వీరికి అన్నీ మంచి ఫలితాలే కలుగుతాయి. అద్బుతమైన ఫలితాలు సాధిస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనం ఉంది. విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ప్రయత్నిస్తున్నవారికి మంచి అవకాశాలు కలుగుతాయి. సంతానం కావాలనుకున్నవారికి సంతోషకరమైన ఫలితాలు కలుగుతాయి.

ధనస్సు రాశి
కొత్త సంవత్సరంలో వీరి శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. పిల్లలు కావాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కడపునకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

కుంభ రాశి
శనిదేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. చాలా విషయాల్లో శుభమే కలుగుతుంది. చురుగ్గా వ్యవహరిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో విజయం కలుగుతుంది. పెట్టే పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు వస్తాయి. పెళ్లి చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి సమయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+