ఈ రాశులకు కలలో కూడా ఊహించని రీతిలో ధనలాభం
జ్యోతిష్యం ప్రకారం గ్రహాల్లో ప్రత్యేకత కలిగిన శుక్రుడు ఈనెల 18వ తేదీన తులారాశిలోకి ప్రవేశించాడు. 18వ తేదీ నుంచి 28 రోజులపాటు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. ఈ రాశికి అధిపతి కూడా ఆయనే దీనివల్ల మాలవీయ రాజయోగం ఏర్పడుతోంది. శుక్రుడి సంచారంవల్ల కొన్ని రాశులవారు గొప్ప గొప్ప పనులు చేసి విజయాలను అందుకుంటారు. వారికి ప్రేమ, సాన్నిహిత్యం లభించడంతోపాటు గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను కూడా పూర్తిచేస్తారు. ఏయే రాశులవారికి ఏ విధంగా కలిసిరానుందో తెలుసుకుందాం.
మేషరాశి
పారిశ్రామికవేత్తలు విభిన్నమైన కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. శత్రువులకు దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కొంతకాలంగా మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నవాటిని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు వారి పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.

తులారాశి
శుక్రుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పుడే మాలవ్య రాజయోగం ఏర్పడింది. వీరికి ధనలాభం కలుగుతుంది. వరుడి కోసం వెతుకుతున్న వధువులకు వారు కోరుకున్న వరుడు దొరుకుతాడు. వీరి ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలను ఆర్జిస్తారు. ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలనిస్తాయి.
ధనుస్సు రాశి
కుటుంబంలో ఎప్పటినుంచో ఉంటున్న కలహాలు తగ్గిపోతాయి. దాంపత్య జీవితం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ సమయంలోనే వివాహాలు కుదురుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలతోపాటు వారి వారి రంగాల్లో మంచిస్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.












Click it and Unblock the Notifications