ఈ రాశుల పంట పండింది.. సువర్ణ యోగంతో మహర్దశ
సంపదకు కారకుడైన శుక్రుడు డిసెంబరు 28వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటికే ఆ రాశిలో శనిదేవుడు సంచారం చేస్తున్నాడు. చాలా అరుదుగా ఈ రెండు గ్రహాల కలయిక 28న జరగబోతోంది. శనిదేవుడు కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తాడు. మంచికి మంచి, చెడుకు చెడు ఫలితాలు వస్తాయి. ఇప్పుడు శుక్రుడు కూడా కలవడంతో కొన్ని రాశులవారికి ఆర్థికపరమైన విషయాల్లో అనేక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
వృషభరాశి
వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు మంచి ప్రయోజనాలు దక్కనున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. విద్యార్థులకు పూర్తిగా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో ఈ రాశివారికి తిరుగులేదని చెప్పొచ్చు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. న్యాయపరమైన కేసుల్లో ఉన్నవారికి ఈ సమయంలో విముక్తి లభిస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు పూర్తిచేయగలుగుతారు.

తులారాశి
నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. అదృష్టం తోడుండటంవల్ల ఏ పని తలపెట్టినా అనుకూలమైన ఫలితాలే కలగబోతున్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయంలో భారీ లాభాలున్నాయి. పలు సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు వారి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది.
మకర రాశి
కెరీర్ పరంగా ఊహించనిరీతిలో ప్రయోజనాలను అందుకుంటారు. ఏ పని తలపెట్టినా విజయం దక్కుతుంది. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుంటుంది. డబ్బులు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.












Click it and Unblock the Notifications