ఆ మూడు గ్రహాలు చెప్పిన మాట వింటే ఈ రాశులవారు తవ్వుకోవడమే
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలనిస్తే మరికొన్నిసార్లు ప్రతికూల ఫలితాలనిస్తాయి. గ్రహాలకు రాజైన సూర్యుడు ఈనెల 16వ తేదీన కన్యారాశిలోకి సంచారం చేస్తున్నాడు. అదే సమయానికి ఆ రాశిలో కేతువు, శుక్రుడు కూడా సంచారం చేస్తుంటాయి. కన్యారాశిలో మూడు గ్రహాలు కలవబోతుండటంవల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే ప్రధానంగా మూడు రాశులవారికి మాత్రం విశేష ప్రయోజనాలు సిద్ధంచనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి
త్రిగ్రాహి యోగం వల్ల ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించడంవల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు. నిరుద్యోగులు స్నేహితుల సహాయంతో మంచి కంపెనీల నుంచి అవకాశాలను అందుకుంటారు. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఆదాయం పెరగడంతోపాటు కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి.

మిథునరాశి
పిల్లలు లేనివారికి ఈ సమయంలో సంతాన యోగం ఉంది. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసించినవారు పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం కనపడుతోంది. ఈ రాశికి చెందిన మహిళలకు బాగా కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేసి అందరి మన్ననలను అందుకుంటారు.
సింహ రాశి
ఉద్యోగాలు చేసేవారికి తోటి ఉద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. మతపరమైన పనులపట్ల ఆసక్తి కలగడంతో పర్యటనలు చేసే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్తగా ఇంటిని లేదంటే భూమిని కొనుగోలు చేస్తారు. జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications