286 రోజులపాటు ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం కేతువు అంతుచిక్కని గ్రహం. నెమ్మదిగా సంచారం చేస్తుంటుంది. గతేడాది అక్టోబరు నెలలో కన్యారాశిలోకి సంచారం చేసి అప్పుడప్పుడు కదలికలను జరుపుతుంటుంది. దీనివల్ల రాశులపై ప్రత్యేక ప్రభావం పడనుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. 286 రోజులపాటు కన్యారాశిలోనే సంచరిస్తుంటుంది. 2025లో రివర్స్ లో కదలికలు ఉండనున్నాయి. ఈ ప్రభావంవల్ల కొన్ని రాశులకు అదృష్టం బాగా కలిసివస్తుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కొత్త పనులు ప్రారంభించినవారికి ఎంతో శుభం జరుగుతుంది. కుటుంబంలో గొడవలు పరిష్కారమవుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక పరమైన యాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. వీరికి అనారోగ్యం కూడా కలుగుతుంది. కాబట్టి పలు జాగ్రత్తలను తీసుకోవాలి.

మేష రాశి
ఊహించని ధనలాభాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. అప్పటివరకు ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. విద్యార్థులకు బాగుంటుంది. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడాలి.
వృశ్చిక రాశి
వ్యాపారస్తులకు విదేశీ ఒప్పందాలు ఉన్నాయి. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. తల్లిదండ్రుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. దీనివల్ల అనుకున్న పనులను సులభంగా పూర్తిచేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. తప్పకుండా వాటిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి.












Click it and Unblock the Notifications