మీనంలో రాహువు.. ఈ రాశులవారు అన్ని సమస్యలకు కొబ్బరికాయ కొట్టొచ్చు
జ్యోతిష్యం ప్రకారం రాహువు అంటే చెడు ఫలితాలను ఇస్తుంది అనే అభిప్రాయం పడిపోయింది. ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న రాహువు వచ్చే ఏడాది కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈనెల ఎనిమిదోతేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడంతో కొన్ని రాశులవారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. రాహువు నక్షత్ర సంచారం వల్ల ఏ రాశులవారికి ఏవిధంగా ప్రయోజనాలు కలుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
మేషరాశి
గతంలో నిలిచిపోయిన పనులు ఈ సమయంలో ప్రారంభమై సులువుగా పూర్తవుతాయి. కెరీర్ కు సంబంధించి పదోన్నతులు లభించడంతోపాటు కొన్ని పనుల్లో విజయం వరిస్తుంది. ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్లే యోగం ఉంది. అవకాశాలు వరిస్తాయి. కష్టపడి పనిచేసేవారికి బాగుంటుంది. వారు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. పిల్లల నుంచి కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి.

కన్య రాశి
ఈ రాశివారి ఏడోస్థానంలో సంచారం జరగడంతో వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. విదేశీ ఒప్పందాలు కుదురుతాయి. జీవితంలో ఎదురవుతున్నసమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అనేక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రాహువు సంచారంతో ఆర్థికంగా మంచి ప్రయోజనాలు దక్కుతాయి. జీవితంలో మంచి స్థాయికి కష్టాన్ని బట్టి చేరుకుంటారు.
కుంభ రాశి
ఆర్థిక పరిస్థితులన్నీ మారిపోతాయి. కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. ఊహించని రీతిలో ధనలాభం ఉంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయి. కొత్త పనులు ప్రారంభించడంవల్ల మంచి లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యలు మధ్య అనుబంధం బలపడుతుంది.












Click it and Unblock the Notifications