గజకేసరి రాజయోగంతో ఈ రాశులవారికి మహారాజ యోగం
జ్యోతిష్యం ప్రకారం దేవ గురువైన బృహస్పతి మే ఒకటో తేదీ నుంచి వృషభరాశిలో సంచారం చేస్తున్నారు. వచ్చే ఏడాది మే 13వ తేదీ వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వైవాహిక జీవితం, అదృష్టం, పిల్లలు, సంపదకు గురువు కారకుడు. మనసుకు, బుద్ధికి కారకుడైన చంద్రుడు ఈనెల రెండోతేదీ ఉదయం వృషభరాశిలోకి ప్రవేశించాడు.
నాలుగోతేదీ మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటాడు. ఎందుకంటే చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. గురువు, చంద్రుడి కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ యోగం వల్ల వ్యక్తి మేధస్సు, జ్ఞానం అభివృద్ధి చెందుతాయి. ఏయే రాశులవారికి ఏవిధంగా ఈ గజకేసరి రాజయోగం వల్ల మేలు కలగబోతోందో తెలుసుకుందాం.

మేష రాశి
మేషరాశివారికి గజకేసరి రాజయోగంవల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వీరికి సంపద పెరగడంతోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అప్పుల నుంచి బయటపడటంతోపాటు కొత్త ఆదాయ వనరులు దొరుకుతాయి. మాట సౌమ్యంగా ఉంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్లికానివారు పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడతారు. జ్ఞానం లభించి మతపరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు.
వృషభ రాశి
వీరి జీవితంలో అన్నీ అనుకూల మార్పులే జరుగుతాయి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడి కొత్త ఆదాయ మార్గాలద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి ఉంది. ఆధ్యాత్మికతవైపు మనసు మళ్లిస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.
కన్యా రాశి
కెరీర్ లో విజయాలు అందుకుంటారు. ధనం వస్తుంది. పూర్వీకుల నుంచి వారసత్వంగా ఆస్తి సంక్రమిస్తుంది. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకొని ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొంటారు. సమాజంలో హోదా పెరగడంతోపాటు వ్యాపారంలో మంచి పురోభివృద్ది సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.












Click it and Unblock the Notifications