ఆశ్లేషలో శుక్రుడు.. ఈనెల 20 నుంచి ఈ రాశులవారికి మహారాజయోగం
వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే వారికి అన్నివిధాలుగా కలిసివస్తుంది. కర్కాటక రాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఈనెల 31వ తేదీ వరకు అక్కడే కొనసాగుతాడు. సంపద, సంతోషం, ఆనందం, కీర్తికి కారకుడైన శుక్రుడు సంచారం చేయడంవల్ల సమస్యలు ఎదుర్కొంటున్న కొన్ని రాశులవారికి అవి పరిష్కారమవుతాయి. ఈనెల 20వ తేదీన పుష్యమి నక్షత్రాన్ని విడిచిపెట్టి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశులవారు చిన్న చిన్న ప్రయత్నాలతోనే పెద్ద స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దీనివల్ల ఏ రాశులవారు లాభపడుతున్నారో తెలుసుకుందాం.
కన్యా రాశి
ఈ సమయంలో వీరికి అన్ని పనుల్లో ఫలితాలు సానుకూలంగా ఉండటమే కాకుండా పెండింగ్ పనులు కూడా పూర్తిచేస్తారు. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య బాంధవ్యం పెరుగుతుంది. వీరితో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. వ్యాపారస్తులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి
ఈనెల 20వ తేదీ నుంచి వీరి జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వివాహ ప్రతిపాదనలను అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందడమే కాకుండా కొత్త ఆదాయ వనరుల నుంచి డబ్బులు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు ఈ సమయం బాగుంటుంది. వస్తువులకు సంబంధించి సౌఖ్యం పెరుగుతుంది. పెళ్లికానివారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు.
కుంభరాశి
ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. ఖర్చులు పెరుగుతాయి.. కాబట్టి వాటిని కాస్త అదుపులో ఉంచుకోవాలి. వారసత్వంగా ఆస్తులు సంక్రమిస్తాయి. సోదరులతో సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయం బాగుంటుంది.












Click it and Unblock the Notifications