గురు మంగళ యోగంతో ఈ రాశులవారు కుబేరులవుతారు
జ్యోతిష్యం ప్రకారం 12 సంవత్సరాల తర్వాత కుజుడు, బృహస్పతి కలయిక జరగబోతోంది. కుజుడు వృషభంలోకి ప్రవేశించనుండగా అప్పటికే అక్కడ గురువు ఉన్నాడు. దీనివల్ల శక్తివంతమైన గురు మంగళ యోగం ఏర్పడబోతోంది. ఈ ప్రభావంవల్ల కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. వృత్తి, వైద్యం, విద్యారంగాల్లో ఉన్నవారు శుభవార్తలను అందుకుంటారు. ఏయే రాశులవారికి ఏవిధంగా శుభ ఫలితాలు కలుగుతున్నాయి? ఏవిధంగా భూలాభాలు, ఆర్థిక లాభాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
అనుకున్న పనులను వెంటనే పూర్తిచేస్తారు. వస్తువులు, వాహనాలను కొనుగోలు చేయడంతోపాటు వీరికి గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఊహించనిరీతిలో ధనలాభాలతోపాటు వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది.

కన్యా రాశి
వీరికి అడుగు తీసి అడుగేస్తే అదృష్టం వరిస్తుంది. ఆ విధంగా వీరికి కలిసిరానుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి సమయం. లాభాలున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి, వృత్తిలో ఉన్నవారికి పురోభివృద్ధి ఉంది. ఈ నెల మొత్తం కన్యారాశివారికి విపరీతమైన లాభాలున్నాయి.
వృశ్చిక రాశి
గురువు, కుజుడు కలయికవల్ల వృశ్చిక రాశివారు ఎంతో అభివృద్ధి సాధిస్తారు. వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలోనే ఫలిస్తాయి. పూర్వీకుల నుంచి ఆస్తి లభించడంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మానసికంగా, శారీరకంగా ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది.












Click it and Unblock the Notifications