ఉగాది నుంచి ఈ రాశులవారు కుబేరులే
వచ్చే నెల 9వ తేదీన ఉగాది పర్వదినం వచ్చింది. ఆరోజు దాదాపు 30 సంవత్సరాల తర్వాత మూడు అరుదైన యోగాలు అమృత సిద్ధి యోగం, సర్బార్థ సిద్ధి యోగం, శశ రాజయోగం ఆరోజు ఏర్పడబోతున్నాయి. జ్యోతిష్యం ప్రకారం ఈ యోగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తొమ్మిదోతేదీన అశ్విని, రేవతి నక్షత్రాలు ప్రత్యేక స్థానాల్లో ఉంటాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ పండగ నుంచి ఏయే రాశులవారు ఏవిధంగా లాభపడనున్నారో తెలుసుకుందాం.
వృషభ రాశి
ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలతోపాటు వేతనాలు పెరుగుతాయి. పదోన్నతులు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఊహించనిరీతిలో లాభాలున్నాయి. అప్పులు చేసినవారికి ఈ సమయం బాగుంటుంది. ప్రత్యేక యోగాలవల్ల కుటుంబంలో ధన ప్రవాహం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.

మిథున రాశి
ప్రత్యేక యోగాలవల్ల ఆస్తులు పెరుగుతాయి. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. అదే సమయంలో కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి శుభప్రదంగా ఉంటుంది. పెట్టుబడిగా పెట్టిన డబ్బుల నుంచి మంచి లాభాలను గడిస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో జరిగే పనుల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి
ఏ పనిచేసినా లాభాలు పొందుతారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలున్నాయి. ఖర్చులు తగ్గించడంవల్ల మంచి ఫలితాలు పొందుతారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పనినైనా తేలికగా పూర్తిచేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. లాభాలు పెరగడంతోపాటు ఖర్చులు తగ్గడంవల్ల ప్రశాంతతను పొందుతారు.












Click it and Unblock the Notifications