2025 వరకు ఈ రాశులు మహర్జాతకులు

రాహు-కేతువులకు జ్యోతిష్యంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇవి సంచరించడంవల్ల మొత్తం 12 రాశులవారిపై ప్రభావం ఉంటుంది. వాస్తవానికి వీటిని కీడు గ్రహాలుగా పరిగణిస్తారు. వీటి సంచార ప్రభావం ఏడాదిన్నర ఉంటుంది. దీనివల్ల కొందరికి సానుకూలంగా ఉంటే మరికొందరికి ప్రతికూలంగా ఉంటుంది. కొన్ని రాశులవారికి 2025 వరకు శుభప్రదంగా ఉంటుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

వృషభ రాశి:వీరికి ఆర్థికంగా లాభాలున్నాయి. ఎటువంటి పని తలపెట్టినా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు దొరుకుతుంది. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగి పనులన్నింటినీ విజయవంతంగా పూర్తిచేస్తారు. ఈ రాశివారు భూమితోపాటు వాహన యోగం కూడా పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు లభిస్తాయి.

these zodica sign people are very lucky due to Rahu Ketu Gochar 2023

మిథున రాశి:ఈ రాశివారికి ప్రధానంగా ఏడాదిన్నర సమయం చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు వారి పై అధికారుల నుంచి సంపూర్ణంగా మద్దతు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గడపడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. అలాగే ఆదాయ మార్గాలు పెరిగి ధన ప్రవాహం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాతో తలపెట్టిన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు.

కర్కాటక రాశి:రాహు-కేతు సంచారం వీరికి బాగా కలిసివస్తుంది. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తను వింటారు. జీవిత భాగస్వామితోపాటు పిల్లల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఊహించని ధన లాభాలున్నాయి. మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి:వీరు జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. పిల్లల నుంచి మద్దతు లభించడంతో మంచి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభిస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారికి ఉపశమనం దొరుకుతుంది. జీవిత భాగస్వామి సలహా, సంప్రదింపులతో ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+