కీలక పరిణామం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం కాలానుగుణంగా ఇతర గ్రహాలతో సంచారం చేస్తుంది. ఇలా సంచరించే క్రమంలో శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. వీటి ప్రభావం వ్యక్తుల జీవితాలపై ప్రతికూల, సానుకూల ప్రభావాలను చూపిస్తాయి. నవంబర్ ప్రారంభంలో శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. అక్కడ శుక్రుడు, కేతువుల కలయిక జరిగింది. ఈ కలయిక పది సంవత్సరాల తర్వాత ఏర్పడింది. దీనివల్ల కన్యారాశి, ధనుస్సు రాశి, మకర రాశులవారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.
కన్య రాశి
అక్టోబరు 30న కేతువు కన్యారాశిలోకి ప్రవేశించాడు. నవంబరు మూడున శుక్రుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించాడు. వీరిద్దరి కలయిక శుభఫలితాలను కలిగిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. అదనపు ఆదాయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఆత్మవిశ్వాసంతో పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రతి పనిని చక్కటి ప్రణాళికతో సక్సెస్ చేస్తారు.

ధనుస్సు రాశి
వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. పనిచేసేచోట చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఏర్పడవు. సంపాదన పెరుగుతుంది. ఆలోచనలన్నీ లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు బాగుంటుంది. వ్యాపారస్తులు కొత్త ఆర్డర్లు పొందుతారు. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.
మకర రాశి
శుక్ర, కేతు కలయిక ఈ రాశివారికి వరంలాంటిది. అదృష్టం తోడుంటుంది. కోరికలన్నీ నెరవేరతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. భూమి లేదంటే వాహన యోగం కనపడుతోంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. పెట్టిన పెట్టుబడిపై లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. తద్వారా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications