ఎల్లుండి నుంచి ఈ రాశులకు కీలకం... జరగబోయేది ఇదే
తెలివితేటలు, తర్కానికి కారకుడైన బుధుడు ఈనెల 27వ తేదీన వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొందరికి సానుకూలంగా, మరికొందరికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. శుభ ఫలితాలనిచ్చే బుధుడు సంచారం చేయడంవల్ల ఏయే రాశులవారికి ఏవిధంగా ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
వృషభ రాశి : వ్యాపారం, వృత్తి పరంగా లాభాలుంటాయి. బుధుడు సంచరించే సమయంలోనే విజయాలు వీరికి అనుకూలంగా మారతాయి. బుధుడి ప్రభావంతో జీవిత భాగస్వామి నుంచి అనేకరకాల ప్రయోజనాలు పొందుతారు. గతం నుంచి వేధిస్తోన్న కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా మంచిది. వారు శుభవార్తను వింటారు.

సింహ రాశి : అదృష్టం రెట్టింపవుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. భవిష్యత్తు కోసం కొత్తగా ప్రణాళికలు రచించుకునేవారికి ఇది మంచి సమయం. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడంవల్ల ఊహించనిరీతిలో లాభాలున్నాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపిస్తారు.
కన్యారాశి : వీరు తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా బాగా కలిసివస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అప్పుల బాధతో ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి వారి వారి కార్యాలయాల్లో ఊహించని రీతిలో లాభాలుంటాయి. కుటుంబంతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళతారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం తథ్యం.












Click it and Unblock the Notifications