కేంద్ర త్రికోణ రాజయోగంతో వీరు కుబేరులే
జ్యోతిష్యం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తాయి. గ్రహాలకు అధిపతి అయిన కుజుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించడంవల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. అయితే కొందరికి మాత్రం ఆకస్మిక ధన లాభంతోపాటు పురోభివృద్ధి కూడా ఉంటుంది. మూడు రాశులవారికి ఇలా జరగనుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
కర్కాటక రాశి
వీరు పనులను తెలివిగా ప్లాన్ చేస్తారు. బంధువల నుంచి, సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది. ధైర్యం పెరుగుతుంది. సంతానంవల్ల ఆనందం పొందుతారు. ఊహించని రీతిలో ఆర్థిక లాభం ఉంటుంది. కెరీర్ లో కోరుకున్న చోటకు బదిలీ చేయబడతారు. పనిచేసేచోట కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పని విజయవంతమవుతుంది.

సింహ రాశి
కోరికలన్నీ నెరవేరతాయి. ఏ పనిలోనైనా సులభంగా విజయం సాధిస్తారు. ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం ఉంది. అంగారకుడు విధి స్థానానికి అధిపతి. దీనివల్ల కాలం అనుకూలంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారు ఏదో ఒక పదవిని పొందుతారు. మెడికల్, హోటల్, ఎరుపురంగు వస్తువులతో వ్యాపారం చేస్తే ప్రయోజనం పొందుతారు.
వృశ్చిక రాశి
ధైర్యం పెరుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను పూర్తిచేస్తారు. వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికను పున: ప్రారంభిస్తారు. అంతేకాకుండా కొన్ని శుభవార్తలను వింటారు. భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. వివాహితులకు వారి జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వివిధరకాల వనరుల నుంచి డబ్బును సంపాదించడంలో విజయవంతమవుతారు.












Click it and Unblock the Notifications