ఈ రాశులకు బంగారు రోజులు ప్రారంభమయ్యాయి
డిసెంబర్ నెల 16వ తేదీన సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి ఈ సంచారం ప్రారంభమవుతుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొందరికి మాత్రం యథావిధిగానే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి:సమాజంలో ఈ రాశివారికి గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఎంది. ఎంత కష్టపడితే అంత విజయం దక్కుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తిస్థాయిలో సహకారం లభిస్తుంది. ఇరువురి మధ్య అనుబంధం బలోపేతమవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు.

మిథున రాశి :గతంలో ఎదుర్కొన్న పలు సమస్యల నుంచి ఈ సమయంలో బయటపడతారు. వాటికి పరిష్కారం దొరుకుతుంది. ధనం కోసం ప్రయత్నించేవారికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యులతో పర్యాటక ప్రదేశాలకు వెళతారు. ఎటువంటి పనులు చేసినా గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవిం గడుపుతున్నవారికి శృంగారానికి సంబంధించిన కోరికలు కూడా నెరవేరతాయి.
మీన రాశి:సూర్యుడి సంచారం వీరికి బంగారు రోజులను తెస్తోంది. అదృష్టం తోడుండటంవల్ల ప్రతి పనిలో సులువుగా విజయం సాధిస్తారు. వివాహితులకు శృంగార కోరికలు నెరవేరతాయి. ఉద్యోగంచేసే చోట పై అధికారుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో బాగుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది.












Click it and Unblock the Notifications