డిసెంబరు 11 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ రాశులకు జరిగేది ఇదే.. పరిశీలించుకోండి
నవగ్రహాల్లో సంపదను ఇచ్చే రాక్షసుల గురువైన శుక్రుడు ఈనెల 11వ తేదీన అస్తమిస్తున్నాడు. అలా శుక్రుడి అస్తమయం ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉంటుంది. దీనివల్ల కొన్నిశుభకార్యాలను జరుపుకోవడం మంచిదికాదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వివాహాలు కూడా జరుపుకోకూడదు. కొన్ని రాశులవారు ఈ సమయంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. అయితే ఏయే రాశులవారు డిసెంబరు 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఒకరకంగా ఇది కీడుకాలం అని చెప్పొచ్చు.

మేష రాశి
కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. నియంత్రించలేరు. జీవితాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు నడిపించాలి. పనులన్నీ నిలిచిపోతాయి. అసహనానికి గురవుతారు. పెళ్లిళ్లు ఆలస్యమవుతాయి. ఊహించనిరీతిలో నష్టాలు కలుగుతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శుక్రుడిని పూజించడంవల్ల సమస్యల నుంచి బయటపడతారు.
వృషభ రాశి
అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేవారు ఆగిపోవడం మంచిది. లేదంటే పెద్దల సలహాలు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం ఉత్తమం. పనులన్నీ పెండింగ్ లో పడతాయి. ఆర్థికంగా కాస్తంత నష్టాలు కలిగే అవకాశాలున్నాయి. భారీ నిర్ణయాలు తీసుకోవడం అనేది వాయిదా వేసుకోవాలి. ఆలోచించి పనులు చేయాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శుక్రుడిని పూజించడంవల్ల సమస్యల నుంచి బయటపడతారు.
మిథన రాశి
అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలన్నీ అస్తవ్యస్తంగా తయారవుతాయి. కొత్త ప్రణాళిక రచించుకొని ముందుకు సాగేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. భార్యభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నవారి మధ్య గొడవలు తలెత్తుతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శుక్రుడిని పూజించడంవల్ల సమస్యల నుంచి బయటపడతారు.












Click it and Unblock the Notifications