అక్షయ తృతీయ నాడు దానాలు చెయ్యలేనివారు ఈ పనులు చెయ్యండి!!
అక్షయ తృతీయ.. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని పరిణయం ఆడిన రోజు. భక్తులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో మహాలక్ష్మిని పూజించే రోజు. ప్రహ్లాదుడికి నరసింహుడు దర్శనమిచ్చిన రోజు. పరమశివుడు సంపదలకు అధిపతిగా కుబేరుడిని నియమించిన రోజు. కొత్త కార్యక్రమాల ప్రారంభానికి శుభసూచకమైన రోజు. అక్షయ తృతీయ అనంత సంపదలను ఇచ్చే రోజు అని అందరూ చాలా విశిష్టంగా అక్షయ తృతీయను భావిస్తారు.
అక్షయం అంటే క్షయం కానిది.. తరిగిపోనిది. అందుకే అటువంటి అక్షయ తృతీయ పండుగను ప్రతి ఒక్కరూ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు దక్కే ఏ కొద్ది పుణ్యమైనా అది అనంత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అయితే చాలామంది అక్షయ తృతీయ రోజు మంచి జరగాలంటే, ఐశ్వర్యం రావాలంటే బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటారు.

కానీ అక్షయ తృతీయ రోజు మంచి ఫలితం కావాలి అనుకునేవారు బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అక్షయ తృతీయ రోజు దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని, అక్షయ తృతీయ రోజు దానం చేయాలనుకునేవారు అన్నదానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు గోదానం, భూదానం, వస్త్ర దానం, సువర్ణ దానం ఏది చేసినా మంచే జరుగుతుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు.
ఇక అక్షయ తృతీయ రోజు దానాలు చేయలేని వారు మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో పూజించాలని, కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి పూజ చేయాలని చెప్తున్నారు. అక్షయ తృతీయ పర్వదినాన గణపతిని ఆరాధించడం కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. శ్రీ మహా విష్ణువును అత్యంత భక్తి శ్రద్దలతో పూజించినా ఫలితం ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ రోజు గంగానదిలో స్నానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని కూడా చెప్తారు. ఇక అక్షయ తృతీయ రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, చెడ్డ పనులు చేస్తే చెడు జరుగుతుందని చెప్తారు.
-
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH!












Click it and Unblock the Notifications