రాహువు-శుక్రుడి సంయోగంతో ఈ రాశులకు తిరుగేలేదు
జ్యోతిష్యం ప్రకారం శుక్రుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎంతో ప్రకాశవంతమైన గ్రహం కావడంతోపాటు అదృష్టానికి, సంపదకు కారకుడు. అటువంటి శుక్రువు వచ్చే నెల 31వ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటికే రాహువు అదేరాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల జరిగే సంయోగం అద్భుతంగా ఉండబోతోంది. ఈ రెండు గ్రహాల కలయిక ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉంటుంది. దీనివల్ల మూడు రాశులవారు మంచి లాభాలను పొందనున్నారు.
కర్కాటక రాశి:
శుక్రుడు-రాహువు కలయిక ఈ రాశివారికి ఎంతో లాభాలన్ని తీసుకురానుంది. కుటుంబంలో సంతోషం వెల్లవిరుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతోపాటు పనిచేసేచోట పై అధికారుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల కోరికలు నెరవేరడంతోపాటు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

వృషభ రాశి:
ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఏప్రిల్ నెలలో వేతనం పెరగుతుంది.. దీంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. కొంతవరకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న వ్యాధుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో ఇతర పనులన్నింటినీ పూర్తిచేస్తారు.
మిథనరాశి:
శుక్రుడి సంచారం వీరికి చాలా బాగుంటుంది. వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకోవడంతోపాటు నలుగురికీ సేవ చేస్తారు. ఏ ప్రాజెక్టును పట్టుకున్నా దాన్ని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి కోరిక నెరవేరుతుంది. ఏదైనా వాహనాన్ని లేదంటే ఆస్తిని కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. ఇది కూడా ఆర్థికంగా లాభసాటినిస్తుంది.












Click it and Unblock the Notifications