జనవరి 1 నుంచి ఈ రాశుల దశ, దిశ మారింది.. మహర్జాతకులయ్యారు
కొత్త సంవత్సరం వచ్చేసింది. అందరూ తమకు ఆర్థికంగా బాగా కలిసివస్తుందనే ఆశాభావంతో ఉంటారు. కొందరు తమ జాతకాలను పరిశీలింపచేస్తుంటారు. మరికొందరు జ్యోతిష్య పండితులను కలిసి తమకు ఎలా కలిసివస్తుందనే విషయాన్ని అడుగుతంటారు. జనవరి 1వ తేదీ నుంచి హిందూ ధార్మికం ప్రకారం మూడు రాశులకు మాత్రం తీవ్రంగా కలిసిరానుందని చెబుతున్నారు. ఒకరకంగా వీరికి బ్రహ్మరథం అని చెప్పొచ్చు అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆ రాశులు ఏమేంటి? ఎలా కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.
ధనస్సు రాశి
ఒకటో తేదీ నుంచి ఈ రాశివారి తలరాత మారిపోయింది. ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశం లబిస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభం ఉండటంతో ఆర్థికంగా బలమైన స్థితికి చేరుకుంటారు. జనవరి 1 నుంచి ఈ రాశివారు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయి. కోరుకున్నచోటకు బదిలీపై కూడా వెళ్లే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి
ఆర్థికంగా బలవంతులవుతారు. ఊహించనిరీతిలో సంపద చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి తిరుగులేదని చెప్పొచ్చు. డబ్బుకు సంబంధించి వీరు ఎటువంటి సమస్యను ఎదుర్కోరు. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు ప్రమోషన్ ఉంది. కెరీర్ చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఒకటో తేదీ నుంచి మహర్జాతకులయ్యారు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని రెట్టింపు పొందుతారు. అన్నివిధాలుగా అందరి నుంచి సహకారం లభిస్తుంది.
మిథున రాశి
వ్యాపారస్తులకు మాత్రం భారీ లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో అధిక సమయం గడుపుతారు. ఒకటో తేదీ నుంచి వీరి దశ, దిశ మారిపోయింది. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవడంతో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబ సభ్యుల్లో పెద్దల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ రంగంలో అడుగు పెట్టినా విజయాలను అందుకుంటారు. బాగా కలిసివస్తుంది. అందుకు అదృష్టం తోడుంటుంది.












Click it and Unblock the Notifications