ఈ నెల 14 వరకు ఓపిక పట్టండి.. తర్వాత ఈ రాశులవారు మహర్జాతకులవుతారు
ఈ నెల 14వ తేదీన హోలీ పండగ ఉంది. ఆరోజు గ్రహాలకు రాజైన సూర్యుడు మీనరాశిలోకి అడుగుపెడతాడు. అప్పటికే ఆ రాశిలో సంపదకు కారకుడయ్యే శుక్రుడు ఉంటాడు. దీంతో రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక జరగబోతోంది. దీనివల్ల ఏర్పడే శుక్రాదిత్య రాజయోగం అత్యంత శక్తివంతమైన యోగం. అలాగే అప్పటికే శుక్రుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడి ఉంటుంది. ఈ సమయంలో మూడు రాశులవారు ఊహించనిరీతిలో ధనలాభాన్ని పొందుతారు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభ రాశి
వీరికి అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టుకుంటుంది. గతంలో నుంచి ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడి మనశ్శాంతిగా జీవిస్తారు. అద్భుతమైన ప్రయోజనాలు దక్కనున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభార్జన ఉంది. పెట్టుబడిని పెద్దల సలహామేరకు మళ్లించాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు.

తులారాశి
రెండు శక్తివంతమైన రాజయోగాలవల్ల ఈ రాశివారి మనసు ఆధ్యాత్మికతవైపు మళ్లుతుంది. న్యాయ సంబంధిత వివాదాల్లో ఉన్నవారికి కాస్తంత ఉపశమనం దొరుకుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగస్థులకు పై అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడి లాభసాటిగా మారతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.
మిథునరాశి
ఈ రాశివారికి ఈ సమయంలోనే కొత్తగా ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. బంగారు ఆభరణాల వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. బాగా కలిసివస్తుంది. ప్రయివేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు మంచి లాభాలను అందుకుంటారు. ఇది వారు ఊహించనిరీతిలో ఉంటుంది. సంపద పెరుగుతుంది.












Click it and Unblock the Notifications