ద్విగుణ నవగ్రహ రాజయోగం.. ఈ రాశులకు అద్భుతమైన ధనయోగం
గ్రహాలు సంచారం చేసినప్పుడల్లా రాశిచక్ర గుర్తులపై ప్రభావం పడుతుందన్న సంగతి తెలిసిందే. ఒక గ్రహం మరో గ్రహంతో కలిస్తే మంచి, చెడు.. రెండు పరిణామాలు సంభవిస్తాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు, సంపదకు కారకుడయ్యే శుక్రుడు సంయోగం చెందడంవల్ల ద్విగుణ రాజయోగం ఏర్పడుతోంది. ఇది చాలా అరుదైన రాజయోగం.
దీనివల్ల మూడు రాశులవారు లాభాలను పొందబోతున్నారు. వచ్చేనెల 27న బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సమయానికి శుక్రుడు అక్కడే ఉంటాడు. వీరిద్దరూ వేర్వేరు స్థితుల్లో సంయోగం చెందడంవల్ల ద్విగుణ రాజయోగం ఏర్పడిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఇది అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని పరిశీలిద్దాం.

సింహ రాశి
వైవాహిక జీవితంలో ఉన్నవారు చాలా సంతోషంగా జీవిస్తారు. ఆకస్మికంగా ఈ రాశివారికి ఆర్థిక లాభాలున్నాయి. డబ్బును పొదుపు చేయడం ఈ రాశివారికి చాలాముఖ్యం. లేదంటే నష్టపోతారు. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతోపాటు కొత్త వ్యాపారాలపై పెట్టుబడులు పెడతారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుండి దూర ప్రయాణాలు చేస్తారు. ద్విగుణ నవగ్రహ రాజయోగం సింహరాశివారికి అపారమైన ఫలితాలను ఇవ్వబోతోంది.
కుంభ రాశి
ఈ రాశివారు ఈ రాజయోగంవల్ల కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్థులకు వేతనం పెరుగుతుంది. వృత్తి జీవితంలో ఉన్నవారు వారు ఊహించనిరీతిలో అభివృద్ధి చెందుతారు. ప్రయాణాలవల్ల కలిసివస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా బాగుంది. వారికి మంచి లాభాలు ఉన్నాయి. ఏ పని తలపెట్టినా సంతోషంగా ఉంటారు.
వృషభ రాశి
స్టాక్ మార్కెట్ సంబంధిత రంగాలలో పెట్టుబడులు పెడితే అద్భుత ఫలితాలను అందుకుంటారు. వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా గడిపేస్తారు. అప్పుల సమస్యల నుంచి బయటపడటంతోపాటు కొత్తగా ఒప్పందాలు కుదురుతాయి. అదృష్టం బాగా కలిసివస్తుంది. ఊహించనిరీతిలో ఆకస్మిక లాభం ఉంది. వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బుధుడిని, శుక్రుడిని పూజించాలి. దీనివల్ల మానసిక ఆనందం పొందుతారు.












Click it and Unblock the Notifications