ఆగస్టులో ఈ రాశులపై మహాలక్ష్మీ కనక వర్షం
రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు నవగ్రహాల్లో అతి కీలక గ్రహం. సంపదకు, కళలకు కారకుడు. వచ్చే నెల 21వ తేదీన మిథునరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈనెల 26న బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించింది. ఆగస్టు 21న ఈ రెండూ కలవనుండటంతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆరోజు నుంచి కొన్ని రాశులవారి తలరాత పూర్తిగా మారిపోనుందని పండితులు చెబుతున్నారు.
మేష రాశి
దాంపత్య జీవితంలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని చవిచూస్తారు. గతంలో నిలిచిపోయి ఇక రాదు అనుకున్న డబ్బు ఈ సమయంలో చేతికి వస్తుంది. కెరీర్ పరంగా సానుకూల నిర్ణయం తీసుకుంటారు. మానసికంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మంచి వృద్ధిలోకి వస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.

వృశ్చిక రాశి
గజలక్ష్మీ రాజయోగం వల్ల ఈ రాశివారు అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. గతంలోకంటే ఇప్పుడు ఆర్థికంగా బలోపేతమవుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు వారి వారి సంబంధాలను పటిష్టపరుచుకుంటారు. ఇరువైపులా లాభాలున్నాయి. కొన్ని సమస్యల నుంచి ఈ సమయంలోనే బయటపడతారు. అద్భుతమైన ప్రయోజనాలను ఈ రాశులవారు అందుకొని సమాజంలో మంచిపేరు తెచ్చుకుంటారు.
వృషభ రాశి
సంగీతానికి సంబంధించిన రంగంలో ఉన్నవారికి కలిసివస్తుంది. అంతేకాకుండా అనేకరకాల ప్రయోజనాలు కూడా అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. అందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. సంపాదన పెరుగుతుంది. ఆదాయం పెరగడానికి అనేకరకాల మార్గాలు తోడవుతాయి. వాటిని వినియోగించుకోవాలి.












Click it and Unblock the Notifications