2025లో ఈ రాశులపై ఏలిన నాటి శని ప్రభావం.. జాగ్రత్త!
నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి నెలలో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఏలిన నాటి కొన్ని రాశులకు ప్రారంభమవుతుంది. శనిదేవుడు న్యాయదేవత. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అందుకు మంచి చేయాలని పెద్దలు చెబుతుంటారు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి శనిదేవుడు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. ఏయే రాశులవారిపై ఏలిన నాటి శని ప్రభావం మొదలవుతుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మేష రాశి
వీరికి ఏలిన నాటి శని ప్రారంభమవుతుంది. దీనివల్లో చేసే పనిలో సమస్యలు ప్రారంభమవుతాయి. అనేక వైఫల్యాలను ఎదుర్కొంటాడు. సమస్యలు ఎదురవుతాయి. వాటిని పరిష్కరించలేరు. శనిదేవుడికి శనివారం రోజు నల్ల నువ్వులతోపాటు నువ్వుల నూనెతో అభిషేకం చేయడంతోపాటు ఆయనకు నల్లటి వస్త్రం కప్పితే కొంతవరకు శాంతిస్తాడు. గురువును దర్శించాలి. బాధలు, సమస్యల తీవ్రతను చాలావరకు ఆయన తగ్గిస్తాడు. అందుకే జీవితానికి కచ్చితంగా గురువు ఉండాలని పెద్దలు చెబుతారు.

కుంభ రాశి
ఏలిన నాటి శనిలో మూడు దశలుంటాయి. మొదటి రెండు దశలు చాలా తీవ్రంగా ఉంటాయి. మూడో దశలో మాత్రం కాస్తంత ఉపశమనం కలుగుతుంది. ఈ మూడో దశలోనే కొన్ని మంచి ఫలితాలను మనం అందుకుంటాం. సమస్యలను పరిష్కరించుకోవడానికి చాలా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు భగవంతుడు అంటనే విముఖత కలుగుతుంది. అలా కాకుండా పట్టుదలగా దేవాలయానికి వెళ్లి భగవంతుడిని దర్శించుకొని కష్టాలను చెప్పుకుంటే ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మీన రాశి
ఏలిన నాటి శని రెండో దశ కూడా చాలా బాధపెడుతుంది. ఈ దశలో అన్నిరకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. శారీరక సమస్యలతోపాటు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారు. మానసిక సమస్యలను ఎదుర్కొనే సమయంలో చాలా బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శారీరకంగా అనారోగ్యం ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి.












Click it and Unblock the Notifications