ఈనెల 12వ తేదీ నుంచి ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే అవుతుంది

గ్రహాల్లో కీలకమైన గ్రహం కుజుడు. గ్రహాలకు ఆయన సేనాధిపతిగా వ్యవహరిస్తాడు. ప్రతి నెలా తన రాశిని మార్చుకునే కుజుడు ఈనెల 12వ తేదీన పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. రాశులతోపాటు నక్షత్రాల్లో కూడా కుజుడు సంచరిస్తాడు. ఇలా పుష్యమిలోకి ప్రవేశించడంవల్ల కొన్ని రాశిచక్ర గుర్తులు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మరికొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇలా మిశ్రమ ఫలితాలనిస్తున్న కుజుడి నక్షత్ర సంచారం ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలను తెస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారికి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. మీ అభిప్రాయాలను బలవంతంగా కుటుంబ సభ్యుల మీద రుద్దకూడదు. మీరు వ్యవహరించే విధానం, మీ ప్రవర్తన మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తోంది. కెరీర్ పరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పనులను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పూర్తిచేసుకుంటుండాలి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి.

three zodiac signs will face somany problems due to mars transit pushyami nakshatram

కర్కాటక రాశి
దాంపత్య జీవితంలో వివాదాలు వద్దు. జీవిత భాగస్వామితో ఎటువంటి వాదనలకు దిగొద్దు. ప్రయాణం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే మానుకుంటే మంచిది. ఏ నిర్ణయం తీసుకుంటున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి, పెద్దలతో మాట్లాడి తీసుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. అతిగా ఆలోచించినా మీకే నష్టం కలుగుతుంది. ఎదుటివారితో మాట్లాడే సమయంలో మాత్రం ఎంతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే తీవ్ర నష్టాలు ఎదురవుతాయి.

ధనుస్సు రాశి
కష్టానికి తగిన ప్రతిఫలం రాదు. మీ ఓర్పుకు ఈ సమయం పరీక్ష లాంటిది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఏ పనినైనా ధైర్యంతో చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలమీద మీకు నమ్మకం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారితో ఎప్పుడూ వాదనకు దిగొద్దు. అలా దిగితే గొడవలు పెద్దవుతాయి. మనశ్శాంతిని కోల్పోతారు. భవిష్యత్తు చాలా బాగుంది. విజయం సాధించడానికి మీరు దగ్గరలోనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+