దీపావళికి ముందే లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులకు కుబేర యోగం
ఈ ఏడాది దీపావళి పర్వదినాన్ని అక్టోబరు 31న కొందరు జరుపుకుంటుండగా మరికొందరు నవంబరు ఒకటోతేదీన జరుపుకుంటున్నారు. ఆరోజు కూడా అమావాస్య ఉండటమే అందుకు కారణం. దీపావళి పర్వదినానికి ముందు కొన్ని శక్తివంతమైన రాజయోగాలు ఏర్పాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బుధుడు, శుక్రుడు కలవడమే. వీటిల్లో ప్రధానమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి సంపద కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఏయే రాశులవారు ఏవిధంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారో తెలుసుకుందాం.
వృషభ రాశి
భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలున్నాయి. ఉపాధి కోసం ఎదురుచూస్తున్నవారి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితులు గతంలోకంటే మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు ప్రత్యేక బోనస్ లు ఉన్నాయి. వీరికి అనుకోకుండా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది.

కర్కాటక రాశి
ఈ రాశివారికి అదృష్టం గట్టిగా పట్టుకుంటుంది. ప్రతి పనిలో సులభంగా విజయాన్ని దక్కించుకుంటారు. వీరు అనుకున్న పనులన్నీ వెంటనే అయిపోతుంటాయి. అదృష్టంతోపాటు భగవంతుడి శక్తి కూడా వీరికి పెరుగుతుంది. రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి బాగా కలిసిరానుంది. ఇబ్బంది కలిగిస్తున్న అంశాలన్నీ ఈ సమయంలో అనుకూలంగా మారతాయి. కోరుకున్న విజయాలను సాధిస్తారు. ఈ సమయం మొత్తం వీరికి లాభదాయకంగా ఉంటుంది.
మీనరాశి
ఎటువంటి పనులైనా వెంటనే నెరవేరతాయి. ఆర్థికంగా ఎదరవుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదృష్టం తోడుండటంవల్ల కలిసివస్తుంది. చిన్న చిన్న అడ్డంకులుంటే తొలగిపోతాయి. చిన్న చిన్న విషయాల్లో ఇతరులతో వివాదాలు పెట్టుకోవడం మానుకోవాలి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు శుభవార్తలను వింటారు.












Click it and Unblock the Notifications