ఆగస్టు 17 నుంచి ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే
గ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. శక్తికి, ధైర్యానికి ప్రతీక. ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని సూర్యుడు మార్చుకుంటాడు. దాదాపు ఏడాది కాలం తర్వాత సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి వచ్చే నెల 17వ తేదీన అడుగుపెట్టబోతున్నాడు. అక్కడి నుంచి సెప్టెంబరు 16వ తేదీ వరకు అదే రాశిలో సంచారం చేస్తాడు. దీనివల్ల వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఏయే రాశులకు ఏవిధంగా సూర్య భగవానుడు అవకాశాలను కల్పించబోతున్నాడనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. ఉద్యోగస్థులకు కూడా అదనపు ఆదాయం వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి, ఆదాయ వనరుల నుంచి ఈసారి ఎక్కువగా డబ్బులు వస్తాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది. లాభార్జన ఉంది. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకొని మాటల్లో మాధుర్యం పెంచుకుంటారు. దీనివల్ల స్నేహితులు పెరిగి సమాజంలో మంచి పేరు వస్తుంది.

ధనుస్సు రాశి
వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషం నెలకుంటుంది. అదృష్టం బాగా కలిసివస్తుంది. సూర్యుడి సంచారం ఈ రాశివారికి చాలా బాగుంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగంలో ప్రమోషన్ రావడంద్వారా ఆదాయం పెరుగుతుంది. వేతనం పెరుగుతుంది.
సింహ రాశి
వృత్తిలో మంచి పురోగతి ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లికానివారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. డబ్బున్న కుటుంబంతో వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పనులు చేస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications