100 ఏళ్ల తర్వాత సప్తగ్రాహి యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం
నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. చాలా అరుదుగా ఒకే రాశిలో కొన్ని గ్రహాలు కలుస్తుంటాయి. ఇటువంటి అరుదైన సంఘటన ఈనెల 29వ తేదీన చోటుచేసుకోబోతోంది. మీనరాశిలో ఏడు గ్రహాలు కలవబోతున్నాయి. ఈ పరిణామం దాదాపు శతాబ్ద కాలం తర్వాత చోటుచేసుకోబోతోంది. శనిదేవుడు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు, కుజుడు, చంద్రుడు మీనరాశిలో కలిసి సప్తగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. దీనివల్ల మూడు రాశులవారి జీవితం పూర్తిగా మారిపోతుందని, ఊహించని సంపద వస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మిథున రాశి
ఉద్యోగం చేస్తున్నవారికి ఇతర అవకాశాలు కూడా వస్తాయి. వేతనం భారీగా పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో మీరు కోరుకున్న మార్పు చోటుచేసుకుంటుంది. అనంతరం జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీల నుంచి అవకాశాలను అందుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. ఆర్థికంగా జీవితంలో మంచి స్థాయికి చేరుకొని మనశ్శాంతిగా ఉంటారు.

కన్యారాశి
వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. వాటిద్వారా ఊహించనిరీతిలో డబ్బును సంపాదిస్తారు. జీవితంలో అంతా సానుకూల మార్పుతోనే పయనం సాగిస్తారు. శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితానికి సంబంధించి అనేక శుభవార్తలను వింటారు. ఏ పని తలపెట్టినా సానుకూల ధోరణితో ముందుకు వెళ్లి విజయాన్ని సాధించి, తద్వారా డబ్బును సంపాదిస్తారు.
కర్కాటక రాశి
పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. కొత్తగా అనేక అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను కుదుర్చుకొని ఆర్థికంగా లాభపడతారు. అంతేకాదు.. వచ్చిన డబ్బుతో కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఢోకా లేదు. చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల కుటుంబ సభ్యులంతా ఆసక్తి చూపిస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. ఉద్యోగస్థులు బాగా రాణించి మంచిపేరు తెచ్చుకుంటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.












Click it and Unblock the Notifications