మే 15వ తేదీ నుంచి ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే
ఖగోళంలో సంచరించే నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ప్రతి 30 రోజులకు ఒకసారి సూర్యుడు తన రాశిని మార్చుకుంటాడు. పరాక్రమానికి, ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి, సుఖసంతోషాలకు ఇతను కారకుడు. ఈనెల 15వ తేదీన సూర్యుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి మారతాడు. ఇలా రాశిని మార్చుకోవడంవల్ల మూడు రాశులకు బాగా కలిసిరానుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని, అందులో మీ రాశి ఉందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభ రాశి
ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు చాలా సులువుగా పూర్తిచేస్తారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. ఉద్యోగస్థులకు వారి కార్యాలయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పనితీరుపై అభినందనలు తెలియజేస్తారు. ఆర్థికంగా మంచిస్థాయికి చేరుకుంటారు. కెరీర్ పరంగా మంచి వృద్ధిని నమోదు చేస్తారు.

కుంభ రాశి
కొత్తగా భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. లేదంటే భవనాన్ని కొనుగోలు చేస్తారు. మీరు మొదటి నుంచి కంటున్న కల నెరవేరుతుంది. ఉద్యోగస్థులకు వేతనం పెరుగుతుంది. దీంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. భౌతికంగా సుఖాలు పెరుగుతాయి. వాహనాన్ని కొంటారు. అలాగే స్థిరాస్తికి సంబంధించిన ఆస్తిని కొనుగోలు చేస్తారు.
మేష రాశి
ఈ సమయంలో వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. మంచి ఆదాయం ఉంటుంది. కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అవి లాభసాటిగా ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు గడిస్తారు. గతంలో నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో తిరిగి చేతికి వస్తుంది. మీ మాటతీరుకు ఎదుటివారు ఆకర్షితులవుతారు. మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది.












Click it and Unblock the Notifications