అరుదైన ద్వి ద్వాదశ యోగం.. ఈ రాశుల తలరాత పూర్తిగా మారిపోతోంది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 9వ తేదీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు శనిదేవుడి సంచారంతోపాటు గ్రహాల రాకుమారుడు బుధుడి స్థానంలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. వీరిద్దరూ 30 డిగ్రీల దూరంలో కలుసుకుంటారు. ఈ ప్రభావంతో ఎంతో శక్తివంతమైన ద్వి ద్వాదశ యోగం ఏర్పడనుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కొన్ని రాశులవారి జీవితాలను ఈ యోగం ఎంతో ప్రభావితం చేయనుంది. ఏయే రాశులపై ఏవిధమైన ప్రభావం చూపుతుంది? వారికి ఏవిధంగా కలిసివస్తుంది? ఎటువంటి ప్రయోజనాలను అందుకోనున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.
మకర రాశి
దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. అవి కూడా లాభసాటిగా ఉంటాయి. శుభవార్తలను వింటారు. కుటుంబంలో వాతావరణం ఎంతో సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉంటారు. మతపరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. ఆధ్యాత్మిక వాతావరణంవైపు మొగ్గుచూపుతారు.

మీన రాశి
ద్వి ద్వాదశ యోగం ప్రభావం ఈ రాశివారిపైనే ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్థుల నుంచి, శత్రువుల నుంచి ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల కొన్నాళ్ల నుంచి వేధిస్తున్నాయి. వాటినుంచి విముక్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. దీంతోపాటు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. ఏ రంగంలో అడుగుపెట్టినా వీరిని విజయం వరిస్తుంది. అదృష్టం బాగా కలిసివస్తుంది.
కుంభ రాశి
జీవితంలో ఇప్పటివరకు చవిచూడని సంతోషాన్ని చూస్తారు. ఆర్థికంగా ప్రయోజనాలున్నాయి. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలన్నీ తీరిపోతాయి. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. శనిదేవుడి అనుగ్రహం లభించి మంచి స్థాయికి చేరుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి మంచి లాభాలున్నాయి. ఆస్తులు కలిసిరావడానికి అవకాశం ఉంది. అన్నిరకాలుగా అన్ని సమస్యల నుంచి బయటపడతారు.












Click it and Unblock the Notifications