50 ఏళ్ల తర్వాత రెండు అరుదైన యోగాలు.. ఈ రాశులకు ఏడు తరాల ఐశ్వర్యం
ఖగోళంలో ఒక రాశి నుంచి మరో రాశికి గ్రహాలు సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో ఒకే రాశిలో రెండు నుంచి ఐదు గ్రహాల వరకు ఒక్కోసారి కలుస్తుంటాయి. ఇటువంటి సమయంలో కొన్ని అరుదైన యోగాలు ఏర్పడి మానవుల వ్యక్తిగత జీవితాలను, సంఘ జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి. అలాగే ఇప్పుడు మీనరాశిలో బుధుడు, శుక్రుడు కలవడంవల్ల లక్ష్మీనారాయణ రాజయోగం, మాలవ్య రాజయోగం ఏర్పడ్డాయి. ఇటువంటి అరుదైన సంఘటన 50 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ యోగాలవల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
జీవితంలో ఇప్పటివరకు లేని సౌకర్యాలు కలుగుతాయి. పనిచేసే ప్రదేశంలో ఉద్యోగస్థులకు వారి పై అధికారులు అనుకూలంగా ఉంటారు. వ్యాపారస్తులకు బాగుంటుంది. మంచి లాభాలున్నాయి. ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కలిసివస్తుంది. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. ఏ పని తలపెట్టినా వారి నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది.

మీన రాశి
ఈ రాశి మొదటి ఇంట్లో ఈ రెండు యోగాలు ఏర్పడ్డాయి. దీనివల్ల వీరికి ఆధిపత్య ధోరణి అలవాటవుతుంది. ఎక్కడైనా వీరి ఆధిపత్యం చెల్లుబాటు అవుతుంది. ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ అద్భుతమైన పనితీరును కనపరుస్తారు. దాంపత్య జీవితంలో భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏ పని తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో పూర్తిచేయగులుగుతారు.
వృషభ రాశి
ఈ రాశివారి 11 ఇంట్లో ఈ రెండు యోగాలు ఏర్పడటంతో ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో మంచి పురోగతిని సాధించడంతోపాటు భారీ లాభాలను ఆర్జిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేసేవారికి ఇప్పుడు చాలా బాగా కలిసివస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ప్రశాంతంగా జీవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్తగా పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. వాటిని ఇతరులకు సాయపడటానికి ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications