నేటి నుంచి ఈ రాశులకు అఖండ రాజయోగం.. అద్భుత సంపద
హనుమజ్జయంతిని ప్రతి ఏడాది మనం రెండుసార్లు జరుపుకుంటాం. చైత్ర పౌర్ణమిరోజు ఒకసారి, వైశాఖ మాసం బహుళ దశమిరోజు మరోసారి జరుపుకుంటాం. దక్షిణ భారతదేశంలో పరాశర సంహిత ప్రకారం, వైశాఖ బహుళ దశమి ఆంజనేయుడి జన్మదినంగా నిర్వహిస్తారు. ఈరోజు మనం స్వామి హనుమ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. ఆరోజు బృహస్పతి, శుక్రుడు ఒకే సరళరేఖ మీదకు రానుండటంతో అరుదైన యోగం ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశులకు ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
సింహరాశి
స్థిరాస్తి రంగంలో ఈ రాశివారు బాగా రాణిస్తారు. అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. డబ్బును సంపాదించి పొదుపు చేస్తారు. అంతేకాకుండా విందులు, వినోదాల్లో పాల్గొంటారు. డబ్బును దుబారా చేస్తే తర్వాత బాధపడతారు. అన్నదమ్ములతో అన్యోన్యంగా ఉంటారు. జీవితకాలంలో కోరుకున్న విజయాన్ని ఈ సమయంలోనే

వృశ్చిక రాశి
ఈ రాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. హోదా పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు బాగా రాణిస్తారు. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోతాయి. అనుకోకుండా ధనం వస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. వారివల్ల మీరు సంతోషంగా ఉంటారు. డబ్బును పొదుపు చేయడంపైనే మీ విజయం ఆధారపడివుంది.
మీనరాశి
ఈ యోగంవల్ల ఈ రాశివారికి విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు తలుపు తడతాయి. రాదు అనుకొని వదిలేసిన డబ్బు చేతికి వస్తుంది. న్యాయ సంబంధిత విషయాల్లో విజయాన్ని నమోదు చేస్తారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. పెళ్లికానివారికి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తారు. పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. మాటతీరు సౌమ్యంగా ఉండాలి.












Click it and Unblock the Notifications