2025లో ఈ రాశులకు కల్యాణ్, ఖజానా జ్యూయలర్స్ ను రాసిచ్చిన శుక్రాచార్యులవారు

ఖగోళంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుండటం అనేది నిరంతరం జరుగుతుంటుంది. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలుగుతాయి. కొన్నిసార్లు రాజయోగాలు ఏర్పడుతుంటాయి. జాతకంలో ఆ గ్రహం శుభస్థానంలో ఉంటే వారికి తిరుగే ఉండదు. డబ్బు, ప్రేమ, ఆనందం ఎల్లప్పుడూ దొరుకుతుటాయి. సంపదకు కారకుడయ్యే శుక్రుడు సంచారం చేసిన ప్రతిసారీ వ్యక్తిగత జీవితాల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. వచ్చే నెల 28వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తుండటంతోపాటు అదే రాశిలో శనిదేవుడి సంచారం కూడా ఉంటుంది. ఈ కదలికలన్నీ శక్తివంతమైన మాలవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీనివల్ల కలిసివచ్చే రాశుల వివరాలను తెలుసుకుందాం.

కర్కాటక రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కార్యాలయంలో ప్రత్యేక హోదా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలకు వెళతారు. ఆస్తికి సంబంధించి కలిసివస్తుంది. దాంపత్య జీవితంలో ఎన్నడూ చవిచూడని సంతోషాన్ని చూస్తారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. కొత్తగా చేసే పనులన్నీ ఆర్థికంగా కలిసివచ్చేలా ఉంటాయి.

three zodiac signs will get extraordinary benefits and purchase new property due to venus transit in pisces in january 2025

వృషభరాశి
మాలవ్య రాజయోగంతో ఈ రాశివారికి అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. అలాగే ఊహించని రీతిలో ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టబడుల నుంచి ఆదాయం వస్తుంది. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థిరాస్తి వైపు మొగ్గుచూపుతారు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని ముందడుగు వేయాలి. వ్యాపారస్తులు తమ తెలివితేటలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. వీరికి కొత్తగా ఆస్తులు కలిసివస్తాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు.

ధనస్సు రాశి
కొత్తగా ఆస్తులు కలిసివస్తాయి. గతంలో పొదుపు చేసిన డబ్బు ఈ సమయంలోనే రెట్టింపు అవుతుంది. తిరిగి మీ చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటుచేసుకుంటుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో తప్పటడుగులు పడే అవకాశం ఉంది. గురువు సలహాలు, సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. కలిసివస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+