గజకేసరి రాజయోగంతో ఏప్రిల్ నుంచి ఈ రాశుల దశ, దిశ మారుతోంది
నవగ్రహాల్లో కీలకమైన బృహస్పతి దేవతలకు గురువు. ఆయన్ను దేవగురువు అని పిలుస్తారు. గురువు రాశి సంచారం చేసినా, నక్షత్ర సంచారం చేసినా ద్వాదశ రాశులన్నీ ప్రభావితమవుతాయి. అలాగే రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అద్భుతమైన యోగాలు ఏర్పడి కొన్ని రాశులకు విశేష ప్రయోజనాలను కల్పిస్తాయి. ఏప్రిల్ రెండోతేదీన చంద్రుడు వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఆ సమయానికి బృహస్పతి ఆ రాశిలోనే సంచారం చేస్తుంటుంది. దీనివల్ల గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం ప్రభావంతో లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.
సింహ రాశి
ఉద్యోగస్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. వ్యాపారస్తులకు ఊహించనిరీతిలో లాభాలు వస్తాయి. ఉద్యోగాలు లేనివారు కొత్తగా ఉద్యోగాలను పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త అవకాశాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది.

కర్కాటక రాశి
ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఏ పని తలపెట్టినా విశేషమైన లాభాలను పొందుతారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. జీవితంలో అంతా సానుకూలంగా జరుగుతుంటుంది. ఆదాయం భారీగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత వెల్లివిరుస్తుంది. సమాజంలో హోదా, గౌరవం కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
వృషభ రాశి
వీరి జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి. గజకేసరి రాజయోగం వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. కొంతకాలం నుంచి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. భవిష్యత్తులో వీరికి సంపద రెట్టింపు అవుతుంది. జీవిత భాగస్వామి సలహా, సంప్రదింపులతో చేసిన పనుల్లో ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు.












Click it and Unblock the Notifications