బృహస్పతి తిరోగమనంతో 25 రోజులు ఈ రాశులపై కుంభవృష్టి
దేవతల గురువైన బృహస్పతి 2025వ సంవత్సరంలో తిరోగమనంలో ఉంటాడు. నవంబరు 11వ తేదీ నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు మిథునరాశిలో తిరోగమనంలోనే సంచరిస్తాడు. ఇలా 25 రోజులపాటు గురువు తిరోగమనంలో ఉండటంవల్ల మూడు రాశులకు అదృష్టం కలిసివస్తోంది. సంపాదన పెరగడంతోపాటు వృత్తిగతంగా, వ్యక్తిగతంగా పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మికతకు, వివాహానికి, సంతానానికి, జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన సహాయ సహకారలను అందజేసే గురువు వల్ల లాభపడే మూడు రాశుల వివరాలను తెలుసుకుందాం.
కన్యా రాశి
కెరీర్ పరంగా మంచి విజయాన్ని నమోదు చేస్తారు. ఉద్యోగస్థులకు ఈ సమయంలోనే పదోన్నతి ఉంది. వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. వచ్చిన డబ్బుతో ఇతర ప్రాంతాల్లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సమయం కూడా ఇదే. ఈ రాశివారికి జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడంతోపాటు గురువును పూజించాలి.

తులా రాశి
గురువు తిరోగమనం చెందడం ఈ రాశివారికి అనేక లాభాలను తెచ్చిపెడుతుంది. సమాజంలో గౌరవాన్ని అందుకోవడంతోపాటు కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఆర్థికంగా అన్నివిధాలుగా కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. నలుగురికి సహాయం చేసే స్థాయికి చేరుకుంటారు. ఇలా సాయం చేయడంవల్ల మంచిస్థాయికి చేరుకుంటారు.
సింహ రాశి
ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త కొత్త మార్గాలద్వారా డబ్బును సంపాదించడానికి అవకాశాలు దొరుకుతాయి. పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయంలో ఎక్కువ లాభాలుంటాయి. అయితే రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టడం మాత్రం మానుకోవాలి. అలాగే గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి లాభాలను ఆర్జిస్తారు. శివాలయాల్లో, ఆంజనేయస్వామి ఆలయాల్లో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. గురువును పూజించాలి.












Click it and Unblock the Notifications