2025లో ఏనుగు కుంభస్థలాన్ని బద్ధలు కొట్టే రాశులు వీరే
జ్యోతిష్యం ప్రకారం నవ గ్రహాల్లో కీలకమైన శని గ్రహానికి అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే శని న్యాయదేవత. చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మంచి చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు. ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు.
గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శనిగ్రహం. కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి వచ్చే ఫిబ్రవరిలో ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల శని, సూర్యుడి కలయిక జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు కలవడంవల్ల కొన్ని రాశులవారు ఇంతవరకు జీవితంలో ఎన్నడూ చూడని ధనాన్ని కళ్లచూస్తారు. ఏయే రాశులవారికి దీనివల్ల కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేషరాశి
ఉద్యోగస్తులకు బాగా కలిసివస్తుంది. ప్రమోషన్స్ తోపాటు వేతనం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. దాంపత్య జీవితంలో కొన్నాళ్ల నుంచి వస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తితోపాటు వ్యాపారంలో ఉన్నవారికి కూడా ప్రయోజనాలు కలుగుతాయి. జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు.
సింహరాశి
దాంపత్య జీవితంలో ఇంతవరకు పొందని సంతోషాన్ని పొందుతారు. అన్ని విధాలుగా ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఎప్పటినుంచో కంటున్న కలలన్నీ నెరవేరతాయి. పెళ్లి కానివారికి ఈ సమయంలోనే పెళ్లి కుదురుతుంది. సూర్యుడు, శనిదేవుడి సంయోగం జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకోవడానికి కారణమవుతుంది.
ధనస్సు రాశి
ఉద్యోగస్తులకు అనేక ప్రయోజనాలున్నాయి. వేతనాలు భారీగా పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. ధనుస్సు రాశివారికి ఆర్థికంగా అనేక మార్పులు చోటుచేసుకొని బలపడతారు. ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా విజయాన్ని అందుకుంటారు. సంపాదన పెరుగుతుంది.












Click it and Unblock the Notifications