కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే

న్యాయదేవుడైన శని చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. శుక్రుడు సంపదకు కారకుడు. వీరిద్దరూ 90 డిగ్రీల కోసం వచ్చే నెల 1వ తేదీన కలుసుకోబోతున్నారు. దీనివల్ల ఏర్పడే కేంద్ర త్రికోణ యోగం వల్ల కొన్ని రాశులవారు మంచి లాభాలను అందుకుంటున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న శనిదేవుడే కేంద్ర త్రికోణ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. 12 రాశులపై ఈ ప్రభావం ఉంటున్నప్పటికీ మూడు రాశులపై అధికంగా ఉంటోంది. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.

మిథున రాశి
ఈ రాశివారి వ్యాపారాలు ఈ సమయంలో భారీ లాభార్జన చేస్తాయి. వచ్చిన డబ్బుతో ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. కొన్నాళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న న్యాయ సంబంధిత వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యలు మొత్తం తగ్గుముఖం పడతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. కొత్తగా వాహనాన్ని, భూములను కొనుగోలు చేస్తారు. కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది.

three zodiac signs will get huge money and good health due to kendra trikona rajayogam

కుంభ రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం ఈ రాశివారికి అద్భుతంగా కలిసిరానుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఉద్యోగస్థులకు వేతనం పెరుగుదలతోపాటు పదోన్నతులుంటాయి. సమాజంలో గౌరవం పెరిగి మర్యాదను అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్థులకు బోనస్ కూడా ఉంది. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెచ్చుకుంటారు. అందుకు బాగా శ్రమించాల్సి ఉంటుంది.

మేష రాశి
కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపుగా పొందుతారు. విద్యార్థులకు చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా విజయాలు సాధిస్తారు. ఈ రాశివారి ఆదాయం భారీగా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. అధిక సమయాన్ని జీవిత భాగస్వామితో గడపడానికే వెచ్చిస్తారు. పెరిగిన ఆదాయాన్ని రాబడి వచ్చేలా మదుపు చేస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శుక్రుడిని, శనిదేవుణ్ని పూజించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+