122 ఏళ్ల తర్వాత గజకేసరి యోగం.. ఈ రాశుల దశ, దిశ మారిపోతోంది
గురుపౌర్ణమి ఈ నెల 10వ తేదీన వచ్చింది. ఆరోజు గురువును పూజించుకోవాలి. అదేరోజు గజకేసరి రాజయోగం ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతోంది. అన్నీ శుభయోగాలే జరగనున్నాయి. ఈ యోగాలు ఏర్పడినప్పుడు సద్వినియోగం చేసుకుంటే మనిషి సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి చేరుకుంటారు. విఘ్నాలను దూరం చేసే గణపతి ఆశీర్వాదం వల్ల ఏర్పడుతున్న గజకేసరి రాజయోగం ఇప్పుడు ఏ రాశులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించనుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మీన రాశి
భూముల మీద వచ్చే ఆదాయం వీరిని కోటీశ్వరులుగా చేస్తుంది. పెళ్లికాని వారికి నచ్చిన యువతి, యువకుడితో పెళ్లి కుదురుతుంది. అదృష్టవంతులవుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాలుగు గడిస్తారు. గౌరవం పెరుగుతుంది. గతంలో ఎవరికైనా ఇచ్చి వదిలేసిన డబ్బులు ఇక రావు అనుకుంటున్న తరుణంలో వస్తాయి. న్యాయ సంబంధిత కేసుల్లో విజయాలను అందుకుంటారు. కోర్టు తీర్పులు వీరికి అనుకూలంగా వస్తాయి.

వృశ్చిక రాశి
వీరికి లాటరీలు లాంటింటి తగిలి ధనలాభం కలుగుతుంది. వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలి. లేదంటే నష్టపోతారు. ప్రధానంగా ఈ రాశివారికి విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అదృష్టం కలిసివచ్చు ఉన్నతస్థాయి పదవులను అలంకరిస్తారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. వారి మద్దతువల్లే మీరు విజయాలను సాధిస్తుంటారు.
సింహరాశి
వీరు ఏ పని తలపెట్టినా చాలా సులువుగా దాన్ని పూర్తిచేస్తారు. ఏ ఆటంకాలు ఎదురుకావు. స్థిరాస్తి రంగంలో ఉన్నవారికి అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా మంచి లాభాలు వస్తాయి. డబ్బు చేతిలోకి వస్తుంది. ఈ రంగం వీరిని పూర్తిగా మార్చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి అనుకోనిరీతిలో శుభవార్తలు వింటారు. దీనివల్ల కుటుంబ సభ్యులంతా సంతోషపడతారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులున్నాయి.












Click it and Unblock the Notifications