నా జాతకమే శాసనం... 2025లో ఈ రాశులకు తిరుగులేదు: పండిట్ కల్కిరామ్

నవగ్రహాల్లో కీలక గ్రహమైన శనిదేవుడు న్యాయదేవత. చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మంచి చేస్తే మంచి ఫలితాలను, చెడు చేస్తే ఆ చెడు కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. శనివారం అనేది సనాతన ధర్మం ప్రకారం ఆయనకు అంకితం చేయబడింది. ఆరోజు ఆయన్ను పూజిస్తే, ఆయనకు నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో అభిషేకిస్తే విజయాలు తథ్యమని పండిట్ కల్కి రామ్ చెబుతున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు. 2025 మార్చి 29వ తేదీన శని మీనరాశిలోకి సంచారం చేస్తాడు. మొత్తం 12 రాశులపై ఈ ప్రభావం ఉంటున్నప్పటికీ కొన్ని రాశులవారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పండిట్ కల్కిరామ్ అభిప్రాయం ప్రకారం మూడు రాశులకు అదృష్టం పూర్తిగా మారిపోతోంది. వారికి ఒకరకంగా ఇది వరంలాంటి సమయం అని చెప్పొచ్చన్నారు.

కర్కాటకం
శనిదేవుడి దయవల్ల వీరికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కొంతకాలంగా పని జరగకుండా పెండింగ్ లో ఉండిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వీరికి గౌరవం పెరగడంతోపాటు సమాజంలో హోదా లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అదనపు ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి.

three zodiac signs will get huge money and Status in society due to lord shani positive effects in 2025

వృశ్చికం
ఈ రాశివారికి ఈ సమయం ఎంతో అద్భుతమైందని చెప్పొచ్చు. శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది.

మకరం
గతంలో నిలిచిపోయిన మీ డబ్బు ఈ సమయంలో తిరిగి చేతికి అందుతుంది. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది అనువైన సమయం. శనిదేవుడి సంచారంవల్ల వీరికి విశేషమైన అనుకూలతలు కలుగుతాయి. శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠనం చేయడంతోపాటు నీలం వస్త్రాలు ధరించండి. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడంవల్ల శుభం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+