పండగకు కేతువల వల్ల ఈ రాశుల సుడి తిరుగుతోంది!
గ్రహాల్లో ఎంతో శక్తివంతమైన గ్రహం కేతువు. దీనికి ఛాయాగ్రహమని పేరు. ప్రతి రాశిలో 18 నెలలు సంచారం చేస్తుంది. ప్రస్తుతం శుభస్థానంలో ఉన్న కేతువు వల్ల విజయ దశమికి మూడు రాశులవారికి అనేక రకాలుగా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అనుకోని రీతిలో మూడు రాశులవారికి బాగా కలిసిరానుంది. ఏయే రాశులవారికి కేతువు వల్ల కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కన్యా రాశి
ఆకస్మికంగా ఈ రాశివారికి ఆర్థికంగా ధనలాభం ఉంది. డబ్బుకు సంబంధించిన అనేక ప్రయోజనాలను అందుకుంటారు. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న ఎన్నో పనులు ఈ సమయంలో పూర్తిచేస్తారు. డబ్బు సంపాదన పెరిగిన తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడంతోపాటు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది.

కుంభ రాశి
ఒకరకంగా ఈ రాశివారికి కేతువు వల్ల అదృష్టం తలుపు తడుతుందని చెప్పాలి. ఎందుకంటే వారికి బాగా కలిసివచ్చే సమయం ఇది. ఉద్యోగస్తులు పదోన్నతి పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ బాగుంటే విదేశీ ప్రయాణం, విదేశీ విద్య వాయిదా వేసుకోవం ఉత్తమం. ప్రస్తుతం విదేశాల్లో భారతీయులకు వ్యతిరేకంగా పరిస్థితులు ఉండటమే దీనికి కారణం. ఇక్కడ సంపాదించే డబ్బులతోనే తృప్తి పడతే మంచిది.
కర్కాటక రాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలోనే లాభాలు రావడం ప్రారంభిస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు పెట్టే పెట్టుబడుల నుంచి భవిష్యత్తులో మంచి రాబడులను అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అందరూ సంతోషంగా జీవిస్తారు. అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులున్నాయి. మాట తీరును ఈ రాశివారు మెరుగుపరుచుకోవాలి. లేదంటే వివాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications