64 ఏళ్ల తర్వాత కుబేర యోగం.. కార్తీకంలో ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో ఏర్పడే యోగాలవల్ల కొన్ని రాశులవారి జీవితం మారిపోతుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తూ ఈ అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. అటువంటిదే పవిత్రమైన కార్తీకమాసంలో 64 సంవత్సరాల తర్వాత అరుదైన కుబేర యోగం రేపు ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి అఖండ ధనయోగం పట్టుకుంటుంది. ధనానికి అధిపతి అయిన కుబేరుడి ఆశీర్వాదం లభిస్తే డబ్బులకు జీవితంలో కొదవే ఉండదు. అటువంటి యోగం వల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.
ధనస్సు రాశి
ఈ రాశివారికి కుబేర యోగం వల్ల రాజకీయ నాయకులతో పరిచయాలు కలుగుతాయి. ఇవి లాభసాటిగా ఉంటాయి. ఎప్పటినుంచో కలలు కంటున్న సొంతింటి కల నిజమవుతుంది. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం వెల్లివిరుస్తుంది. ఆర్థిక స్థితి మారిపోవడంవల్ల కుటుంబ సభ్యులందరితో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. ప్రధానంగా దాంపత్య జీవితం చాలా బాగుంటుంది.

మేషరాశి
ఈ రాశివారికి కొన్నాళ్లుగా కోర్టుల్లో నడుస్తున్న కేసులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. తీర్పు ఈ రాశివారికి అనుకూలంగా వస్తుంది. అంతేకాదు.. వీరివల్ల గతంలో లాభం పొందినవారు ముఖం చాటేశారు. అయితే ఈ సమయంలో మళ్లీ వీరి దగ్గరకే వారు వస్తాయి. వీరి విలువ తెలుసుకొని సఖ్యతగా మెసలుకుంటారు. అయితే వీరికి తిరిగి డబ్బిచ్చే విషయంలో మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
మీన రాశి
కుబేర యోగంవల్ల ఈ రాశివారికి అఖండ ధనలాభం కలగబోతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడంతోపాటు పెళ్లి కానివారికి మంచి సంబంధాలు కుదురుతాయి. సమాజంలో గౌవర మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసివస్తుంది. అందుకు అదృష్టం తోడుండటంతోపాటు జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ స్థాయిలో మద్దతు లభిస్తుంది.












Click it and Unblock the Notifications