బలపడుతున్న శుక్రుడు, శని... ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టే రాశులు వీరే
దివ్వెల పండుగ దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఈనెల 20వ తేదీన వస్తోంది. దీపావళికి ముందే సంపదకు కారకుడైన శుక్రుడు, కర్మల ప్రకారం ఫలితాలనిచ్చే శనిదేవుడు కలిసి శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మీనరాశిలో తిరోగమన దిశలో కదులుతున్న శని ప్రభావం కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకొస్తుంది. ఏయే రాశులకు శుక్రుడు, శని కలిసి ఎటువంటి ప్రయోజనాలను అందిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారికి చెప్పలేనంత సంఖ్యలో పుష్కలమైన అవకాశాలు లభించి ఆర్థికంగా స్థిరపరుస్తాయి. కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ సమయంలోనే శుభవార్తలను అందుకుంటారు. కోరుకుంటున్న రీతిలోనే ఉద్యోగం దొరుకుతుంది. కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. భగవంతుణ్ని ఆరాధించాలి. కోరికలను నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలి.

వృషభ రాశి
ఈ రాశి వారికి అంతా శుభప్రదమే. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అందుకు మీరు నమ్ముకున్న భగవంతుడే కారణం. గురువును పూజించాలి. వైవాహిక జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు. సంతానం లేనివారికి సంతానం కలిగేందుకు గురువు చెప్పిన మాటను వినాలి.
మకర రాశి
వీరికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాల్లోకి పెట్టుబడులుగా మళ్లిస్తారు. ఉద్యోగస్థులకు కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. చేస్తున్న పనుల్లో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తిచేయగలుగుతారు.












Click it and Unblock the Notifications