మీనరాశిలో శని.. 42 నెలలు ఈ రాశులకు అఖండ ధనయోగం

కర్మల ప్రకారం ఫలితాలను అనుగ్రహించే శని భగవానుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి గ్రహాన్ని మారుస్తుంటాడు. కుంభరాశిలో తిరోగమన దశలో ఉన్న శని ఈ ఏడాది నవంబరు నుంచి ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తాడు. వచ్చే ఏడాది మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ప్రారంభమయ్యే శని సడేసతి వల్ల కొన్ని రాశులవారికి సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. శని సంచారం ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుంది? వారికి ఏవిధంగా ప్రయోజనాలను తీసుకురానుంది అనే విషయాలను తెలుసుకుందాం.

మకర రాశి
శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే ఈ రాశివారికి సడే సతి నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్నీ సానుకూల ఫలితాలనే పొందుతారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది. అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు ఆదాయ వనరులు దొరుకుతాయి. విద్యార్థులకు బాగా కలిసివచ్చే సమయం ఇది. పరీక్షల్లో విజయాలు అందుకుంటారు. ప్రస్తుతం ఈ రాశివారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతోంది.

three zodiac signs will get money 42 months due to shani transit in pisces

కర్కాటక రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు కీర్తి పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి వారు కోరుకున్నచోటకు బదిలీ అవుతుంది. ప్రమోషన్స్ కు అవకాశాలున్నాయి. మాటతీరువల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉండటంతో ఆర్థికంగా పరిస్థితి పటిష్టవంతంగా మారుతుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

వృశ్చిక రాశి
వీరికి అర్థాష్టమ శని నుంచి విముక్తి లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. అదృష్టం తోడుగా ఉండటంవల్ల అన్ని పనులు నెరవేరతాయి. శనిదేవుడి చెడు ప్రభావం తొలగిపోవడంవల్ల లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు మనసులో కోరికను నెరవేర్చుకుంటారు. ఆకస్మికంగా ధనలాభం ఉంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+