ఒకే రాశిలో శని, శుక్రుడు... 2025లో ఈ రాశుల జీవితం అద్భుతం
నవగ్రహాల్లో శనిదేవుడు న్యాయదేవత. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే జీవితం సంతోషంగా గడుస్తుంది. అన్ని విషయాల్లో విజయాలను అందుకుంటారు. సంపదకు, లగ్జరీ జీవితానికి కారకుడైన శుక్రుడు, శనిదేవుడు 2025లో కుంభరాశిలో కలుస్తున్నారు. ఈనెల 28న శుక్రుడు కుంభరాశిలోకి, వచ్చే ఏడాది మార్చిలో శని మీనరాశిలోకి ప్రవేశించనున్నారు. ఏయే రాశులపై ఏవిధమైన ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.
నక్షత్ర మార్పు వల్ల..
శనిదేవుడు శతభిషా నక్షత్రం నుంచి పూర్వాభాద్రలోకి 27వ తేదీ రాత్రి ప్రవేశించాడు. దీనివల్ల వృషభరాశివారు శనిదేవుడి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. అంతా శుభం జరుగుతుంది. కుంభరాశివారికి కూడా మంచే జరుగుతుంది. ధన ప్రవాహం ఉంటుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. అలాగే కన్యారాశివారు ఆర్థికంగా లాభపడతారు. వీరికి అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. దీనివల్ల ఆత్మవిశ్వాసంతో అన్నిరకాల పనులు పూర్తిచేయగలుగుతారు.

మీనరాశి
శుక్రుడు, శని కలవడంవల్ల ఏ పని తలపెట్టినా నష్టాలు వస్తాయి. ఉద్యోగంలోకానీ, వ్యాపారంలోకానీ జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. అనవసరపు ఖర్చులు ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకొని నిలబడాలి. శనిదేవుడికి నల్ల నువ్వులతో, నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. శుక్రుడిని పూజించాలి.
ధనుస్సు రాశి
జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. మనశ్శాంతి ఉండదు. పరిస్థితిలు దారుణంగా తయారవుతాయి. అవసరాల కోసం రుణం తీసుకుంటారు. ఇది ఇబ్బందులు పెడుతుంది. కొత్త ఏడాదిలో ఎంతో సహనంతో, ప్రశాంతంగా ఉండాలి. లేదంటే నష్టాలు తప్పవు.
కన్యా రాశి
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రతికూల ప్రభావాలు ఎదురవడంతో అనేక కష్టాలుంటాయి. శుక్రుడు, శనిదేవుడు కలిసివున్నంతకాలం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. కోరికలు నెరవేరని కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు.












Click it and Unblock the Notifications