ఈ రాశులపై వరాల జల్లు కురిపిస్తున్న శని
నవగ్రహాల్లో కీలక గ్రహమైన శనిదేవుడు న్యాయదేవుడు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. మరో మూడు నెలల్లో మూడు రాశులవారి జీవితాల్లో మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు శని. వారిపై ఒకరకంగా వరాల జల్లు కురిపిస్తున్నాడని చెప్పొచ్చు. మనం చేసే సకల కర్మలకు కారకుడైన శనిదేవుడు ఏయే రాశులను కరుణిస్తున్నాడు? వారికి ఏవిధంగా కలిసి వచ్చేలా చేస్తున్నాడు అనే విషయాలను తెలుసుకుందాం.
మిథున రాశి
ఎటువంటి సమస్యనైనా వీరు చాలా సులువుగా పరిష్కరిస్తారు. అందుకు తగ్గ నేర్పరితనం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులద్వారా ఆదాయం పెరుగుతుంది. తాము తీసుకున్న నిర్ణయాలతో వీరు చాలా సంతృప్తి చెందుతారు. ఉద్యోగస్థులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగుతుంది.

కుంభ రాశి
వ్యాపారంలో భాగస్వామి నుంచి మంచి సహకారం లభించి సంతోషంగా ఉంటారు. స్నేహితుల నుంచి మీకు అవసరమైన సహాయం అందుతుంది. డబ్బును ఎక్కువగా పొదుపు చేయడానికి చూస్తారు. అనుకోకుండా ధనం లభించే అవకాశం ఉంది. వ్యక్తిత్వాన్ని బాగా మెరుగుపరుచుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. అదృష్టం తోడుండటంవల్ల అనేక పనులు చాలా సులువుగా పూర్తవుతాయి. వాటి నుంచి ధనలాభాన్ని పొందుతారు.
మకర రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు ఈ సమయంలోనే పూర్తవుతాయి. అక్కచెల్లెళ్లతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. ఒకరిపై మరొకరికి ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగస్థులకు ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. ఆర్థిక లాభాలున్నాయి. ఈ రాశివారి మూడో ఇంట్లో శని ఉండటంవల్ల అనుకున్న పనులన్నీ సులువుగా నెరవేరుతాయి.












Click it and Unblock the Notifications