నేడు అనంత చతుర్దశి.. ఈ రాశులవారు జాక్ పాట్ కొట్టి తీరుతారు!
సెప్టెంబర్ 25, 2026 శుక్రవారం అనంత చతుర్దశి. ఈ రోజు అత్యంత ప్రభావవంతమైన శుక్రవారం కావటం అన్ని రాశులవారికి ప్రత్యేకం. నేటి శుక్రవారం చాలా విశేషం. శ్రీ విష్ణుమూర్తి యొక్క అనంత స్వరూపం మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు నేడు కొన్ని రాశుల వారిపై పుష్కలంగా ఉంటాయి.
నేడు విశేష యోగాలతో వీరికి జాక్ పాట్
బుధాదిత్య యోగం, పారిజాత యోగం, శూల యోగం , మరియు కొన్ని నిర్దిష్ట రాశుల వారికి మాలవ్య, భద్ర యోగాలతో శుభ ప్రదంగా ఉంటుంది . దీని శుభ ప్రభావం కారణంగా, వృషభ, సింహ, ధనుస్సు, మరియు కుంభ రాశుల వారికి వ్యాపారంలో గణనీయమైన లాభాలు వస్తాయి. ప్రభుత్వ కార్యాకలాపాలు పూర్తవుతాయి.నేడు ఈ రాశులవారు జాక్ పాట్ కొట్టి తీరుతారు.
మేషం
మేషరాశి జాతకులకు నేడు కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ప్రేమలో నిజాయితీగా ఉండండి.

వృషభం
వృషభ రాశి జాతకులకు కుటుంబంలో మీ అభిప్రాయానికి విలువ ఉంటుంది. పనిలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.
మిథునం
నేడు మిథున రాశి జాతకుల ఇంట్లో కొత్త సమాచారం తెలుస్తుంది. మాటల నైపుణ్యంతో పనిలో గుర్తింపు వస్తుంది. ఆకస్మిక ఖర్చులు రావచ్చు. ప్రేమలో ఓపెన్ గా మాట్లాడండి.
కర్కాటకం
కర్కాటక రాశి వారి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పని నెమ్మదిగా కానీ స్థిరంగా సాగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. ప్రేమలో మంచి సమయం.
సింహం
సింహరాశి జాతకుల కుటుంబ నిర్ణయాల్లో పాత్ర ఉంటుంది. పనిలో నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ప్రేమలో ఇష్టమైన వాళ్లకు సమయం ఇవ్వండి.
కన్య
కన్యా రాశి జాతకులకు ఇంట్లో సహకారం ఉంటుంది. పని బిజీగా ఉంటుంది. జీర్ణకోశ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త . ప్రేమలో చిన్న విషయాలపై వాదులాడకండి.
తులా
తులా రాశి జాతకులు కుటుంబంతో సమయం గడపండి. పనిలో టీమ్ సపోర్ట్ బాగుంటుంది. పాత డబ్బు రావచ్చు. దాంపత్యం సంతోషంగా ఉంటుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి జాతకులకు ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఉంటుంది. ఆలస్యమైన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకులకు కుటుంబంలో సహకారం ఉంటుంది. పనిలో మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా లాభం కనిపిస్తుంది. ప్రేమలో ఆనందం ఉంటుంది.
మకరం
మకర రాశి వారికి నేడు ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రగతి కనిపిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.
కుంభం
కుంభ రాశి జాతకులకు కుటుంబంలో సంతోషం ఉంటుంది. పనిలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. ప్రేమలో అవగాహన పెరుగుతుంది.
మీనం
మీనరాశి జాతకులకు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. పని సాఫీగా సాగుతుంది. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమలో మంచి సమయం. ఈ రోజు సానుకూలంగా ఉండి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications
